ఫైర్ వార్నింగ్‌తో దుబాయ్ వెళ్తున్న విమానం దారి మళ్లింపు.. అసలేం జరిగిందంటే..

కేరళలోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని కన్నూరుకు దారిమళ్లించారు.

Google News Follow Us

కేరళలోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని కన్నూరుకు దారిమళ్లించారు. కరిపూర్ నుంచి విమానం టేకాఫ్ అయిన గంట తర్వాత విమానంలోని కార్గో హోల్డ్‌లో ఫైర్ వార్నింగ్ లైట్‌ను గమనించిన పైలట్.. వెంటనే కన్నూరు విమానాశ్రయనాకి మళ్లించారు. అయితే వార్నింగ్ లైట్ తప్పుడు అలారం అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఈ ఘటన బుధవారం(సెప్టెంబర్ 27న) రోజున  చోటుచేసుకుంది. 

వివరాలు.. విమానం-ఐఎక్స్ 345..  సిబ్బందితో సహా మొత్తం 176 మందితో విమానం ఉదయం 9.53 గంటలకు కరిపూర్ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు బయలుదేరింది. విమానం ఒక గంట  ప్రయాణించిన తర్వాత.. పైలట్ కార్గో హోల్డ్‌లో వార్నింగ్ లైట్‌ను గమనించి కన్నూర్‌కు మళ్లించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే విమానం కన్నూర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేయబడింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.

‘‘తప్పుడు అలారంతో.. మా కోజికోడ్-దుబాయ్ విమానం కన్నూర్‌కు మళ్లించబడింది. కన్నూర్ నుంచి దుబాయ్‌కి షెడ్యూల్ చేసిన కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయబడింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులకు జరిగిన ఆలస్యం, అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. వారికి ఆహారం, ఫలహారాలను అందించబడ్డాయి’’ అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు. షార్జా నుంచి కన్నూర్‌లో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఈ ప్రయాణికులను దుబాయ్‌కి తీసుకెళ్లడానికి ఉపయోగించబడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.