గర్బా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో 19 ఏళ్ల యువకుడు మృతి..

గార్బా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ యువకుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన ఘటన గుజరాత్ లో వెలుగుచూసింది. 

19-year-old dies of heart attack while dancing garba - bsb

గుజరాత్‌ : గుజరాత్‌లో విషాద ఘటన వెలుగుచూసింది. సోమవారం నాడు ఓ19 ఏళ్ల యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. వినిత్ మెహుల్భాయ్ కున్వరియా అనే బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు ప్రకటించారు. జామ్‌నగర్‌లోని పటేల్ పార్క్ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

యువకుడికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. రాబోయే నవరాత్రి ఉత్సవాలకు సన్నాహకంగా పటేల్ పార్క్ ప్రాంతంలో ఉన్న గార్బా క్లాస్‌లో ప్రాక్టీస్ చేస్తున్న అతను మొదటి రౌండ్ పూర్తి చేసిన తర్వాత అనూహ్యంగా నేలపై కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్నవాళ్లు అతడిని మొదట పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి జీజీ ఆసుపత్రికి బదిలీ చేశారు. అక్కడ అతను చేరిన తర్వాత మరణించినట్లు ప్రకటించారు. 

Latest Videos

పెళ్లైన పుష్కరానికి భార్య బంగ్లాదేశీయురాలని తేలడంతో.. ఆ భర్త చేసిన పని...

కున్వరియా కుటుంబ సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ, జామ్‌నగర్‌లోని 'స్టెప్ అండ్ స్టైల్ దాండియా అకాడమీ'లో ప్రాక్టీస్ చేస్తుండగా, సోమవారం రాత్రి 10:30 గంటలకు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడని చెప్పారు. 19 ఏళ్ల యువకుడైన కున్వర్ కి ఎటువంటి అనారోగ్యం లేదని, పూర్తి ఆరోగ్యవంతంగా ఉండేవాడని ఆయన తెలిపారు.

ముఖ్యంగా, యువకులలో గుండె సమస్యలకు సాధారణ కారణాలు గుండె జబ్బులకు చెందిన ఫ్యామిలీ హిస్టరీ, మధుమేహం, రక్తపోటు, జీవనశైలి సమస్యలు, ఊబకాయం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటి వైద్య పరిస్థితులు కలిసి ఉన్నాయి.

కున్వరియాలాంటి అనేక మరణాలు వెలుగులోకి రావడంతో ఇలాంటి ఘటనలు వైద్య నిపుణులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో, ఒక యువకుడు ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతూ జిమ్‌లో కుప్పకూలిపోయాడు. ఈ ఘటన ఘజియాబాద్‌లోని సరస్వతి విహార్‌లో చోటుచేసుకుంది. బాధితుడు, సిద్ధార్థ్ కుమార్ సింగ్, తన వ్యాయామ దినచర్యలో అకస్మాత్తుగా, ప్రాణాంతకమైన గుండెపోటుతో మరణించాడు. 

vuukle one pixel image
click me!