పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి: ప్రమాణం చేయించిన తమిళి సై

Published : May 07, 2021, 01:45 PM IST
పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి: ప్రమాణం చేయించిన  తమిళి సై

సారాంశం

 పాండిచ్చేరి సీఎంగా రంగస్వామి శుక్రవారంనాడు ప్రమాణం చేశారు. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  ఇవాళ రంగస్వామితో ప్రమాణం చేశారు. 

పుదుచ్చేరి: పాండిచ్చేరి సీఎంగా రంగస్వామి శుక్రవారంనాడు ప్రమాణం చేశారు. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  ఇవాళ రంగస్వామితో ప్రమాణం చేశారు. రంగస్వామి ఒక్కరే ప్రమాణం చేశారు. మంత్రులు తర్వాత ప్రమాణం చేయనున్నారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు రంగస్వామి మంత్రివర్గంలో చోటు దక్కనుంది. అయితే బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఉందని  సమాచారం.

పాండిచ్చేరిలో ఆరుగురికి మించి మంత్రివర్గం ఉండకూడదు.కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన నమ:శివాయకు  డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది జనవరి మాసంలో నమ:శివాయ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో ఎఐఎన్ఆర్‌సీ 10 స్థానాలను కైవసం చేసుకొంది. బీజేపీ పోటీ చేసిన 9 స్థానాల్లో ఆరింటిని గెలుచుకొంది. రాష్ట్ర అసెంబ్లీలో 30 స్థానాలున్నాయి. డీఎంకె పోటీ చేసిన 13 అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 14 స్థానాల్లో రెండు స్థానాల్లో గెలుపొందింది. 
 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?