నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రగడ.. ఆయనైతే నాకూ ఓకే : ఒవైసీ

Siva Kodati |  
Published : May 24, 2023, 04:36 PM IST
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రగడ.. ఆయనైతే నాకూ ఓకే : ఒవైసీ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తే ఆ కార్యక్రమానికి తాను దూరంగా వుంటానన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. పార్లమెంట్‌పై స్పీకర్‌కే సర్వాధికారాలు వుంటాయని ఆయన స్పష్టం చేశారు. 

నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించడానికి సిద్ధం కావడంపై దేశంలోని విపక్షాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రపతి ప్రారంభిస్తేనే తాము ఈ కార్యక్రమానికి హాజరవుతామని లేదంటే బాయ్ కాట్ చేస్తామని దేశంలోని విపక్ష పార్టీలు సంయుక్తంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి తాను కూడా దూరంగా వుంటున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌పై స్పీకర్‌కే సర్వాధికారాలు వుంటాయని.. అందువల్ల కొత్త భవనాన్ని ఆయే ప్రారంభించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఒకవేళ స్పీకర్ ఓంబిర్లా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తే.. తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని ఒవైసీ స్పష్టం చేశారు. 

అంతకుముందు ఆదివారం న్యూఢిల్లీలో జరిగే భారత పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు డుమ్మా కొట్టాలని నిర్ణయించుకున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనబోమని ఇప్పటికే 19 పార్టీలు ప్రకటించాయి. ఈ కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తున్నట్టు తేల్చి చెప్పాయి. ఈ పరిణామం గతంలో చైనాలో జరిగిన ఘటనను తలపిస్తోంది. అక్కడ కూడా ఇలాగే ప్రతిపక్షాల నుంచి ఒక్క పార్టీ కూడా ప్రాతినిధ్యం వహించలేదు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), వామపక్షాలు, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), సమాజ్ వాదీ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన వర్గం పాల్గొనబోమని బుధవారం ప్రకటించాయి.

ALso Read: పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవ వేడుకను బహిష్కరించిన 19 ప్రతిపక్ష పార్టీలు.. ఎందుకంటే ?

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బదులుగా ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. అలాగే జాతిపిత మహాత్మాగాంధీకి భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్న, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన తర్వాత బ్రిటీష్ వారికి జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇచ్చిన హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని పలు పార్టీలు తప్పుబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో విపక్షాలకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కౌంటరిచ్చారు. భారతదేశ పురోగతిపై కాంగ్రెస్ కు జాతీయ స్ఫూర్తి లేదని అన్నారు. 1975 అక్టోబర్ 24న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంట్ అనెక్స్ భవనాన్ని ప్రారంభించారని, 1987 ఆగస్టు 15న రాజీవ్ గాంధీ పార్లమెంట్ లైబ్రరీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ‘‘మీ ప్రభుత్వాధినేత పార్లమెంటు అనుబంధాన్ని, లైబ్రరీని ప్రారంభించగలిగినప్పుడు, ఇప్పటి ప్రధాని ఎందుకు అలా చేయకూడదు’’అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. అధికారులు పనిచేసే అనెక్స్ ను, ఒకవైపు పెద్దగా ఉపయోగించని లైబ్రరీని ప్రారంభించడానికి, ప్రజాస్వామ్య దేవాలయాన్ని, గర్భగుడిని ప్రారంభించడానికి చాలా తేడా ఉందని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mahindra Scorpio N : భారీ మార్పులతో స్కార్పియో వచ్చేస్తోంది.. ధర ఎంతో తెలుసా..?
Lactobacillus Bulgaricus: బ్యాక్టీరియా కూడా రాష్ట్ర గుర్తేనా? కేరళ రికార్డ్ | Asianet News Telugu