
లక్నో : ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM) చీఫ్ Asaduddin Owaisi శ్రీరాముని వంశస్థుడని BJP MP బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. ఆయన కుమారుడు ప్రతీక్ భూషణ్ సింగ్ బీజేపీ అభ్యర్థిగా గోండా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
బ్రిజ్ భూషణ్ kaiserganj నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన కుమారుడు ప్రతీక్ విజయం కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓవైసీ తనకు Old friend అని చెప్పారు.తనకు తెలిసినంత వరకు ఆయన క్షత్రియుడు అని తెలిపారు. ఆయన Sri Rama వంశస్థుడు అని ఇరాన్ కు చెందిన వాడు కాదని చెప్పారు. ఓవైసీ పార్టీతో సమాజ్వాది పార్టీ పొత్తు కుదుర్చుకోనందుకు మండిపడ్డారు. Muslimsపై నాయకత్వం కోసం Akhilesh Yadav, ఓవైసీ పోట్లాడుకుంటున్నారు అన్నారు.
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మోసగాడు అన్నారు. ఆయన తన తండ్రిని, తన అంకుల్ని మోసం చేశాడు అన్నారు. మోసం చేయడమే ఆయన పని అని దుయ్యబట్టారు. బీజేపీకి రాజీనామా చేసి ఎస్ పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్యాని కూడా మోసం చేశారని ఆరోపించారు.
కాగా, ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్లో తన వాహనంపై దాడి చేసిన వారు గాంధీని చంపిన వ్యక్తిలాంటి మనస్తత్వం కలిగిన వారేనని AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫిబ్రవరి 9న అన్నారు. ఆరోజు సంభాల్ లో ఓ సభలో ఆయన మాట్లాడారు. యూపీలో మాఫియా రాజ్ అంతమైందదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెబుతుంటే తనపై బుల్లెట్లు పేల్చింది ఎవరు? అని ప్రశ్నించారు. ‘వారు గాడ్సే వారసులు. గాంధీని చంపిన వారి లాంటి మనస్తత్వం ఉన్నవారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అగౌరవపరచాలని కోరుకునేవారు. వారు చట్టాన్ని విశ్వసించరు. బ్యాలెట్ లను నమ్మరు.. కానీ బుల్లెట్లను నమ్ముతారు’ అని ఓవైసీ మండిపడ్డారు.
ఫిబ్రవరి మొదటి వారంలో ఉత్తరప్రదేశ్లో అసదుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన హాపూర్ కు వెళ్లారు. ప్రచార కార్యక్రమం అనంతరం ఆయన హాపూర్ నుంచి వెళ్ళిపోతుండగా టోల్ ప్లాజా సమీపంలో ఇద్దరు దుండగులు అసదుద్దీన్ ఓవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కారుకు బుల్లెట్లు తగిలాయి. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఎర్రకోట, కుతుబ్మినార్ తదితర ప్రదేశాలను తమ పూర్వీకులు భారత్ కు ఇచ్చారని అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ప్రకటనతో ఓవైసీపై కాల్పులు జరిపామని ఓ నిందితుడు తెలిపాడు.
ఈ ఘటన నేపథ్యంలో ఒవైసీకి జెడ్-కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కానీ దానిని ఒవైసీ తిరస్కరించారు. ఈ విషయంలో పార్లమెంట్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. ఒవైసీకి ఇంకా ముప్పు ఉందని, ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించాలని కోరారు. కానీ దానికి ఒవైసీ ఒప్పుకోలేదు.తాను స్వేచ్ఛా పక్షిని అని చెప్పారు.