
ముంబాయి (mumbai) లో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏళ్త తన సహోద్యోగిని రాళ్లతో కొట్టి చంపాడు. ఈ ఘటన ముంబాయిలోని పశ్చిమ శివారు అంధేరిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు పాల్పడిన 22 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉంటాయి. రాహుల్ గైక్వాడ్ (Rahul Gaikwad), సుశాంత్ ఘోట్కర్ (Sushant Ghotkar) ఇద్దరు సహోద్యోగులు. అయితే గత వారం అంధేరి (anderi)లోని మరోల్ (marol)ప్రాంతంలో కలిసి మద్యం సేవించాలని నిర్ణయించుకున్నారు. మమద్యం తాగుతున్న క్రమంలో ఇద్దరి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. దీంతో రాహుల్ గైక్వాడ్ ముఖంపై, సుశాంత్ ఘోట్కర్ రాయి తీసుకొని పలు ఆర్లు కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దెబ్బలకు తట్టుకోలేక అతడు మృతి చెందాడు. అతడి మృతదేహం తరువాత పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం అతడు పోలీసులకు చిక్కాడు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య) కేసు నమోదు చేశామని, విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా..మద్యం మత్తులో చాలా మందిలో ఆలోచన, విచక్షణా శక్తి క్షీణిస్తోంది. వావి వరుసలు మరిచి ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఏపీలోని కృష్ణా (krishna)జిల్లాలోని కీసర (keesara) సొంత చిన్ననాన్నే చిన్నారిపై అత్యాచారం చేశాడు. చిన్నారి మృతి చెందడంతో సోమవారం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఈ నెల 9వ తేదీన వెలుగులోకి వచ్చింది.
సూర్యాపేటకు చెందిన మృతురాలి కుటుంబం ఏపీలోని కృష్ణా జిల్లా కంచికర్ల ప్రాంతంలోకి ఉంటున్నారు. ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుంటూ జీవిస్తుంటారు. అయితే మైలవరానికి చెందిన బాబాయ్ గత నెల 7వ తేదీన సూర్యాపేటకు వచ్చాడు. 10 చిన్నారిని తన వెంట తీసుకెళ్తానని నమ్మించాడు. మైలవరం వెళ్లే మార్గంలో డ్రింక్ చేశాడు. దీంతో అతడికి మత్తు ఎక్కింది. దీంతో అతడిలో చెడు ఆలోచన కలిగింది. సొంత అన్న కూతురు అని చూడకుండా సుబాయిల్ పండ్ల చెట్లలో సమీపంలోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో చిన్నారి అరవడంతో బండతో తలపై బాది అక్కడి నుంచి పారిపోయాడు. చిన్నారి మృతి చెందింది. ఈ నెల 9వ తేదీన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సోమవారం సాయంత్రం అతడిని అరెస్టు చేశారు.
మద్యం మత్తులో ఓ కుమారుడు కన్నతల్లినే చంపేసిన ఘటన రెండు రోజుల కిందట తూర్పు గోదావరిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్న దొర, అర్జులమ్మ (60)దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు మత్స్యలింగం (35) ఆదివారం అర్ధరాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తల్లి అర్జులమ్మను నిద్ర లేపి భోజనం పెట్టమన్నాడు.ఈ సమయంలో చారు మాత్రమే ఉందని, కూర లేదని చెప్పడంతో ఆగ్రహించిన కొడుకు తల్లిపై చేయి చేసుకున్నాడు. అడ్డు వచ్చిన తండ్రితో వాగ్వాదానికి దిగాడు. దీంతో పెద్ద కుమారుడిని తీసుకు వస్తానని చెప్పి తండ్రి బయటకు వెళ్ళాడు. అప్పటికే బాగా మత్తులో ఉన్న మత్స్య లింగం విపరీతమైన కోపంతో తల్లి తలపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్త స్రావం జరిగి తల్లి అక్కడే చనిపోయింది.