అన్నాడీఎంకెకు వినతి: చంద్రబాబు కోసం స్టాలిన్

Published : Jul 19, 2018, 11:35 AM ISTUpdated : Jul 19, 2018, 11:37 AM IST
అన్నాడీఎంకెకు వినతి: చంద్రబాబు కోసం స్టాలిన్

సారాంశం

కేంద్రప్రభుత్వంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి తాము సంపూర్ణ మద్దతిస్తున్నట్టు డీఎంకె చీఫ్ స్టాలిన్ ప్రకటించారు. తమ డిమాండ్ల సాధన కోసం టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి  మద్దతివ్వాలని అన్నాడీఎంకెను  కూడ స్టాలిన్ డిమాండ్ చేశారు, 


చెన్నై:కేంద్రప్రభుత్వంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి తాము సంపూర్ణ మద్దతిస్తున్నట్టు డీఎంకె చీఫ్ స్టాలిన్ ప్రకటించారు. తమ డిమాండ్ల సాధన కోసం టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి  మద్దతివ్వాలని అన్నాడీఎంకెను  కూడ స్టాలిన్ డిమాండ్ చేశారు, 

ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ  టీడీపీ కేంద్రంపై  అవిశ్వాస తీర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మాణానికి అనుకూలంగా టీడీపీ పలు పార్టీల మద్దతును  కూడగడుతోంది. అయితే  కేంద్రంపై అవిశ్వాసానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు డీఎంకె చీఫ్ స్టాలిన్ ప్రకటించారు.

 

 

మరోవైపు  తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకె కూడ కేంద్రంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడ పలు రాజకీయ పార్టీల మద్దతు కూడ కోరుతున్నాయి.

 తాజాగా తమిళనాడుకు చెందిన  డీఎంకె కూడ  అవిశ్వాసానికి మద్దతుగా నిలవడంతో  రాజకీయ  సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొనే  అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?