పెళ్లి కూతురు లేచిపోయిందని...కూలీని పెళ్లి చేసుకోనున్న ఎమ్మెల్యే

Published : Dec 26, 2018, 12:43 PM IST
పెళ్లి కూతురు లేచిపోయిందని...కూలీని పెళ్లి చేసుకోనున్న ఎమ్మెల్యే

సారాంశం

అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఈశ్వరన్ మళ్లీ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే యువతిని పెళ్లి చేసుకోవడానికి ఆయన రెడీ అయ్యారు. 

అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఈశ్వరన్ మళ్లీ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే యువతిని పెళ్లి చేసుకోవడానికి ఆయన రెడీ అయ్యారు. ఇప్పటికే పెళ్లి చూపులు అయిపోగా.. త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

గత సెప్టెంబర్ నెలలో ఈశ్వరన్(43)ను సత్యమంగళం పెరియార్ నగర్ కి చెందిన సత్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి తేదీ కూడా ఖరారు చేశారు. ఆ పెళ్లికి ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ముఖ్య అతిథులుగా హాజరుకావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కూతురు వేరే యువకుడితో లేచిపోయింది.

పెళ్లి సమయానికి వధువు దొరికినప్పటికీ.. పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయ్యింది. అదే ముహుర్త సమయానికి మరో యువతిని పెళ్లి చేసుకోవాలని ఈశ్వరన్ భావించినప్పటికీ కుదరలేదు. దీంతో.. అక్కడితో పెళ్లి ప్రయత్నాలు ఆపేశారు. తాజాగా.. ఆయనను పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు ఒత్తిడి తీసుకురావడంతో.. ఆయన పెళ్లికి అంగీకరించారు.

దీంతో.. కూలిగా పనిచేస్తున్న యువతిని పెళ్లి చేసుకోవడానికి ఈశ్వరన్ అంగీకరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుంది. 

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే