హెలికాఫ్టర్‌లో వచ్చి సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం

By Siva KodatiFirst Published Feb 17, 2021, 9:26 PM IST
Highlights

ఎన్నికల్లో గెలిచిన భారీ కాన్వాయ్‌‌తో అశేష జనవాహిని మధ్య ప్రమాణ స్వీకారం చేసే సంస్కృతి మనదేశంలో ఎప్పటి నుంచో వస్తోంది. ప్రజాధనాన్ని ఆడంబరాల కోసం వృథా చేస్తున్నారని ప్రతిపక్షాలు, సామాజిక సంస్థలు మండిపడుతున్నా నేతలు మాత్రం మారారు.

ఎన్నికల్లో గెలిచిన భారీ కాన్వాయ్‌‌తో అశేష జనవాహిని మధ్య ప్రమాణ స్వీకారం చేసే సంస్కృతి మనదేశంలో ఎప్పటి నుంచో వస్తోంది. ప్రజాధనాన్ని ఆడంబరాల కోసం వృథా చేస్తున్నారని ప్రతిపక్షాలు, సామాజిక సంస్థలు మండిపడుతున్నా నేతలు మాత్రం మారారు.

అయితే ఇలాంటి వేడుకలు ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులు వంటి పెద్ద పెద్ద పదవులను అధిష్టించేవారే చేస్తారని అనుకునేవారు. అయితే మహారాష్ట్రలో మాత్రం అందరికి విభిన్నంగా గెలిచిన సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేపట్టాడు. ఏకంగా హెలికాఫ్టర్‌లో గ్రామానికి వచ్చి సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేశాడు 

వివరాల్లోకి వెళితే.. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పూణేలో ఉంటున్న పారిశ్రామికవేత్త జలీందర్ గగారే(50) అంబి-డుమాలా అనే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో ఆయనతో పాటు 9 మంది సభ్యుల ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసింది.

ఇటు వ్యాపార పనుల్లో బిజీగా వున్న జలీందర్ గగారే ప్రమాణ స్వీకారం కోసం పూణే నుంచి నేరుగా తన స్వగ్రామానికి ఏకంగా హెలికాప్టర్‌లోనే వచ్చి గ్రామస్తులను ఆశ్చర్యపరిచారు.

హెలిప్యాడ్ వద్దే గ్రామ ప్రజలు ఆయనకు పూల మాలలతో స్వాగతం పలికారు. 12 ఎడ్ల బండ్ల మీద ఉరేగింపుగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. వ్యాపార రీత్యా పూణేలో నివసిస్తున్నప్పటికీ తన స్వగ్రామం, సన్నిహితులతో సంబంధాన్ని తెంచుకోలేదని గంగారే పేర్కొన్నాడు. పుట్టిన ఊరిని అభివృద్ధి చేసుకోవాలనే సర్పంచ్‌గా పోటీ చేశానని జలిందర్‌ తెలిపారు.

click me!