
Faisal Patel : కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత నాయకుడు అహ్మద్ పటేల్ తనయుడు ఫైసల్ పటేల్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకామాండ్ తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశముందనే సంకేతాలు పంపారు. తాజాగా ఫైజల్ పటేల్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. కాంగ్రెస్ అధినాయకత్వంపై అసంతృప్తిని.. నిరాశను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తనకు ఎలాంటి ప్రొత్సాహం లభించడం లేదని తెలిపారు. చాలా కాలం నుంచి వేచి చూసిచూసి.. అలసిపోయానని పేర్కొన్నారు. తన భవిష్యత్ ఎంపికలను తెరిచి ఉంచానంటూ.. కాంగ్రెస్ ను వీడే ఆలోచనను వెల్లడించారు.
'నేను వేచి చూస్తూ.. అలసిపోయాను. అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. అన్ని ఎంపికలు మా వైపు నుండి తెరిచి ఉంచబడ్డాయి' అని ట్వీట్ చేశారు.
కాగా, కాంగ్రెస్ లో బలమైన నాయకుడిగి ఎదిగన అహ్మద్ పటేల్ దీర్ఘకాలిక అనారోగ్యంతో 2020 నవంబర్ లో మరణించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విధేయుడిగా పరిగణించబడుతున్న అహ్మద్ పటేల్, గాంధీ కుటుంబం తర్వాత పార్టీలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణించబడ్డారు. అటువంటి పరిస్థితిలో, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఫైసల్ పటేల్ కాంగ్రెస్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తడం ద్వారా పార్టీ ఆందోళనను పెంచారు. గుజరాత్‌లో గత 27 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ తిరిగి అధికార పీఠం దక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలు రచిస్తోంది.
అయితే, అహ్మద్ పటేల్ తనయుడు ఫైసల్ పటేల్ రాజకీయాల్లోకి రావడంపై స్పష్టమైన ప్రకటన రాలేదు. లాంఛనంగా రాజకీయాల్లోకి రావడంపై తనకు ఇంకా నమ్మకం లేదని గత నెలలో ట్వీట్ చేశారు. అయితే, ఆయన తన సొంత జిల్లా భరూచ్ మరియు నర్మదాలో 'పుర్దే కే పేచే సే' పార్టీ కోసం పని చేస్తారు. అలాగే, ఏప్రిల్ 1 నుంచి భరూచ్, నర్మదా జిల్లాల్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో పర్యటిస్తానని ఫైసల్ చెప్పారు. అదే సమయంలో ఆయన చేసిన ట్వీట్‌తో ఇప్పుడు రాజకీయ చర్చ జోరందుకుంది.
దీనికి తోడు ఫైసల్ గత సంవత్సరం AAP అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు, అతను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాలకు ఆజ్యం పోశారు. ఇప్పుడు రాబోయే ఎన్నికలకు ముందు గుజరాత్‌లో ఆప్‌ని విస్తరించాలని చూస్తున్నందున , ఆ ఎంపిక మళ్లీ తెరమీదకు రావచ్చు. ఫైసల్ పటేల్ ఆమ్ ఆద్మీలో చేరితే గనక కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. కాగా, ఫైసల్ నటి అమీషా పటేల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి.