
డెహ్రాడూన్ : ఓ బామ్మకు Rahul Gandhi అంటే వీరాభిమానం. అందుకే తనకున్న యావదాస్తిని అతని పేరు మీద రాసేసింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజంగా జరిగింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మీద ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంది ఓ బామ్మ... తనకున్న properties అన్నింటినీ రాహుల్ పేరుమీద రాసేసింది. ఆయన అవసరం ఇప్పుడూ దేశానికి ఎంతగానో ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్లోని dehradunకు చెందిన 78 ఏళ్ల పుష్ప ముంజియల్ కు రాహుల్ గాంధీ అంటే అమితమైన అభిమానం. ఆయన సిద్ధాంతాలు నచ్చిన ఆమె.. తన పేరుమీద ఉన్న 50 లక్షల విలువైన ఆస్తులు, 10 తులాల బంగారం రాహుల్ గాంధీకి చెందేలా వీలునామా రాసింది. సోమవారం పిసిసి మాజీ చీఫ్ ప్రీతమ్ సింగ్ నివాసానికి వెళ్లిన ఆమె రాహుల్ పేరు మీదకు తన ఆస్తులు బదలాయిస్తున్న వీలునామాను అందజేశారు. ఈ వీలునామాలో కోర్టులోనూ సమర్పించారు.
‘దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాహుల్ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఆయన అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఈ దేశానికి ఎంతో అవసరం. అందుకే నా మరణానంతరం నా ఆస్తులని రాహుల్ కే చెందేలా వీలునామా రాశాను. ఇదే విషయాన్ని కోర్టుకూ చెప్పాను’ అని తెలిపారు. ఈ వీడియో చూసి మొదట ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ నేతలు.. ఆ తర్వాత ఆమెను అభినందించారు.
ఇదిలా ఉండగా, దేశంలో చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో వాహనదారులతో పాటు సామాన్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఘాటుగా స్పందించారు. ఇది ‘ప్రధానమంత్రి జన్ ధన్ లూట్ యోజన’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నిత్యావసర వస్తువుల ధరల రోజు వారి పెరుగుదల సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా వంటకు ఉపయోగించే నిత్యావసరలతోపాటు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగుతుండడం ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతోంది. ప్రస్తుత ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి సర్కాన్ పై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ధరల తగ్గింపుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చమురు ధరలు, నిత్యావసరాల ధరల పెరుగుదలపై స్పందిస్తూ కేంద్రంలో మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఇది మోడీ సర్కారు ‘ప్రధానమంత్రి జన్ ధన్ లూట్ యోజన’ అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ తన ట్విట్టర్ లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు.. ఏర్పాటు అయిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. అలాగే, పెట్రోల్, డీజిల్ ను వివిధ వాహనాల్లో ట్యాంక్ ఫుల్ చేపిస్తే కాంగ్రెస్ పాలనలో ఉన్న ధరలు.. ప్రస్తుతం బిజెపి హయాంలో ఉన్న ధరను పోల్చుతూ ఉన్న ఓ చిత్రాన్ని కూడా పంచుకున్నారు. దానికి ప్రధానమంత్రి జన్ ధన్ లూట్ యోజన అంటూ రాసుకొచ్చారు.