Agnipath : ‘‘యువ‌త గొంతు వినండి.. వారి సంయమనం పరీక్షించొద్దు’’ - ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూచ‌న‌

Published : Jun 16, 2022, 04:39 PM IST
Agnipath : ‘‘యువ‌త గొంతు వినండి.. వారి సంయమనం పరీక్షించొద్దు’’ - ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూచ‌న‌

సారాంశం

ఆర్మీ ఉద్యోగ ఆశావహులకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. నిరుద్యోగ యువత గొంతు వినాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అగ్నిపథ్ ను విమర్శించారు. 

అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. రక్షణ ఉద్యోగ ఔత్సాహికులకు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని, సాయుధ దళాలను గౌరవించడం లేదని ఆయ‌న విమ‌ర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకుని రాహుల్ గాంధీ వ్యాఖ్య‌లు చేశారు. ‘‘ ప్రధానమంత్రి గారు.. దేశంలోని నిరుద్యోగ యువత గొంతు వినండి, వారిని ‘అగ్నిపథ్’పై నడిపించడం ద్వారా వారి సంయమనాన్ని పరీక్షించవద్దు’’ అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కూడా ఆర్మీ ఉద్యోగ అశావ‌హుల‌కు మద్దతుగా నిలిచారు. కేంద్రం యువతకు నాలుగేళ్లు కాకుండా పూర్తి కాల ఉద్యోగాలు క‌ల్పించాల‌ని కోరారు. ‘‘ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.. యువతకు నాలుగేళ్లు కాకుండా జీవితాంతం దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి. గత రెండేళ్లుగా ఆర్మీలో రిక్రూట్ మెంట్ లేకపోవడం వల్ల అధిక వయస్సు వచ్చిన వారికి కూడా అవకాశం ఇవ్వాలి ’’ అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. అగ్నిపథ్ పథకాన్ని ఈ దేశ యువత అంగీకరించలేదని, ఈ నిర్ణయంపై యువకులు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని తెలిపారు. సైన్యం మన దేశానికి గర్వకారణమని అన్నారు. మన యువత తమ జీవితాన్నంతా దేశానికి అంకితం చేయాలని, వారి కలలను నాలుగేళ్లకు పరిమితం చేయొద్దని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

Assam: అసోంను ముంచెత్తిన భారీ వ‌ర్షాలు.. గోడ‌కూలి ఇద్ద‌రు మృతి.. కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు !

కేంద్ర ప్ర‌భుత్వం రెండు రోజుల కింద‌ట అగ్నిప‌థ్ ప‌థ‌కం ప్రారంభించింది. ఇండియ‌న్ ఆర్మీ, ఇండియ‌న్ నేవీ, ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ల ఆధ్వ‌ర్యంలో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ప‌థ‌కాన్ని లాంచ్ చేశారు. ఈ ప‌థ‌కం కింద మూడు ద‌ళాల్లో నాలుగేళ్ల పాటు యువ‌త‌ను రిక్రూట్ చేసుకుంటారు. ఇందులో రిక్రూట్ అయిన అభ్య‌ర్థుల‌ను అగ్నివీర్స్ అని పిలుస్తారు. ఇలా నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవ‌లందించిన అగ్నీవ‌ర్స్ లో 25 శాతం మందిని రెగ్యులర్ గా తీసుకుంటారు. మిగిలిన 75 శాతం అగ్నివీర్ లను పాక్యేజీ ఇచ్చి పంపిస్తారు. అయితే వీరు ఇంటికి వ‌చ్చిన త‌రువాత వివిధ సంస్థ‌లు రిక్రూట్ చేసుకోవ‌డానికి ఆస‌క్తి చూపించే అవ‌కాశం ఉంది. 

ఈ అగ్నిప‌థ్ స్కీమ్ ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ ద‌ళాల్లో స‌ర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మ‌హిళ‌లు, పురుషుల‌ను ఇద్ద‌రినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అల‌వెన్సుల‌తో క‌లుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది.  90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఆర్మీలో 40,000 మంది, వైమానిక దళంలో 3,000, నేవీలో 3,000 మందిని రిక్రూట్ చేసుకోవాల‌ని భావిస్తోంది. 

Myths vs Facts: అగ్నిపథ్ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ.. అగ్నివీర్ల భవిష్యత్ భద్రం

అయితే ఈ ప‌థ‌కంపై నిరుద్యోగ యువ‌త తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా మరియు అనేక ఇతర రాష్ట్రాల్లోని యువకులు బుధ‌వారం నుంచి ఆందోళ‌న చేస్తున్నారు. గురువారం బీహార్ ఈ నిర‌స‌లు హింసాత్మ‌కంగా మారాయి. రోడ్ల‌పై నిర‌స‌న‌కారులు వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. ప‌లు వాహ‌నాల‌కు నిప్పంటించారు. పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. ట్రైన్ ట్రాక్ ల‌పై కూర్చున్నారు. రైళ్ల‌కు మంట‌పెట్టారు. రోడ్ల‌పైకి టైర్ల‌ను తీసుకొచ్చి త‌గుల‌బెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక‌త్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పోలీసులు నిర‌స‌నకారుల‌పై టియ‌ర్ గ్యాస్ కూడా ప్ర‌యోగించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !