
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ పథకంపై అగ్నిపథ్ పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ కీలక ప్రకటన చేశారు. నాలుగేళ్ల పాటు అగ్నివీర్ లుగా పని చేసి తిరిగి వచ్చిన వారిలో 75 శాతం మందికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా ఉద్యోగాలు ఇస్తుందని తెలిపారు.
Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు.. మరో 11 మంది మృతి
“ 4 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చే 75 శాతం అగ్నివీర్లకు హర్యానా రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుంది. అగ్నివీర్ లు గ్రూప్ C ఉద్యోగాల కోసం ఏదైనా కేడర్‌లో చేరవచ్చు. లేకుంటే మాకు పోలీసు ఉద్యోగాలున్నాయి. వాళ్లకు అవి ఇస్తాం’’ అని అన్నారు. కాగా ఈ అగ్నిపథ్ పథకం ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ దళాల్లో సర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మహిళలు, పురుషులను ఇద్దరినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అలవెన్సులతో కలుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. 90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇబ్బందుల్లో ఉద్దవ్ ఠాక్రే సర్కార్.. మంత్రి ఏక్‌నాథ్‌తో పాటు 11 మంది శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు!
ఈ పథకాన్ని జూన్ 14వ తేదీన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలో ప్రకటించారు. అయితే ఈ పథకం నిబంధలు సరిగా లేవంటూ దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. రెండేళ్ల నుంచి ఆర్మీలో రిక్రూట్ మెంట్ జరకపోవడంతో అసంతృప్తిగా ఉన్న యువతకు ఈ పథకం మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో అనేక రాష్ట్రాల్లో ఆర్మీ వీధుల్లోకి వచ్చి వాహనాలను ధ్వంసం చేశారు. రోడ్లపై టైర్లకు మంటలు అంటించారు. ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. రైలు పట్టాలపై కూర్చొని నిరసనల తెలిపారు. రైలు బోగీలకు నిప్పంటించారు.
వావ్.. ఆక్సిజన్ కూడా సరిగా అందని చోట.. 17,000 అడుగుల ఎత్తులో ఐటీబీపీ జవాన్ల యోగాసనాలు
ఈ నిరసనలు తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. మొదటి రిక్రూట్ మెంట్ కు అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 23 సంవత్సరాలకు పెంచింది. అలాగే నాలుగేళ్ల సేవలు పూర్తి చేసుకున్న అగ్నివీర్లకు.. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులు, అన్ని 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లలో చేర్చుకోవడానికి పది శాతం రిజర్వేషన్ ఇస్తామని తెలిపింది. ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఇది వరకే ఉన్న రిజర్వేషన్‌కు తోడు ఇది అదనంగా ఉంటుందని పేర్కొంది. దీంతో పాటు సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్‌లకు కూడా రిజర్వేషన్ ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. పలు బీజేపీ పాలిత ప్రాంతాలు కూడా రాష్ట్ర పరిధిలో ఉండే పోలీసు ఉద్యోగాల నియామకాల్లో ప్రియారిటీ ఇస్తామని ప్రకటించాయి. కాగా ఈ హింసాత్మక నిరసనలకు పాల్పడిన వారిని త్రివిధ దళాల్లో చేర్చుకోబోమని ఓ సీనియర్ సైనిక అధికారి హెచ్చరించారు.