అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే సిద్ధూ ఇంటికి నోటీసులు

Published : Jun 24, 2020, 09:27 AM IST
అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే సిద్ధూ ఇంటికి  నోటీసులు

సారాంశం

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని కతిహార్ జిల్లాలో జరిగిన ఎన్నికల సమావేశంలో ప్రసంగిస్తూ ఒక సంఘంపై సిద్ధూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ జ్యోత్ సింగ్ సిద్ధూ ఇంటికి బిహార్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిద్ధూ ఇంటి ముందు పోలీసులు నోటీసులు అంటించారు. ఆయనపై గతంలో పోలీసు కేసు నమోదవ్వగా.. దానికి ఆయన స్పందించలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు నోటీసులు అంటించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని కతిహార్ జిల్లాలో జరిగిన ఎన్నికల సమావేశంలో ప్రసంగిస్తూ ఒక సంఘంపై సిద్ధూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు  సిద్దూపై కేసు నమోదైంది.

జూన్ 18 నుండి, బీహార్ పోలీసులకు చెందిన ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు బెయిల్ బాండ్ పేపర్‌పై సంతకం పొందడానికి రోజూ 4-5 గంటలు మిస్టర్ సిద్దూ నివాసం వెలుపల వేచి ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం స్పందించలేదు. దీంతో ఇంటికి నోటీసులు అంటించినట్లు పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ఈసారి చ‌లికాలం కూడా చ‌మ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయం.. వాతావ‌ర‌ణంలో పెను సంచ‌ల‌నాలు
RBI: దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారనున్న ఆ 5 గండాలు.. రిజర్వ్ బ్యాంక్ బిగ్ అలర్ట్