4వేల కోట్ల స్కాంలో ఇరుక్కున్న ఐఏఎస్ అధికారి సూసైడ్

By Sreeharsha GopaganiFirst Published Jun 24, 2020, 8:47 AM IST
Highlights

కేసులో తన పేరు బయటకు రావడం, అరెస్ట్ కూడా అవడం అన్ని వెరసి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అలా కృంగుబాటులోకి వెళ్లి ఆత్మహత్యకు ఒడిగట్టి ఉంటాడని కుటుంబసభ్యులు అంటున్నారు. రెండు వారాల క్రితమే కర్ణాటక ప్రభుత్వం విజయ్ శంకర్ ను విచారించేందుకు సిబిఐ కు అనుమతులిచ్చింది. 

నాలుగువేల కోట్ల ఐఎంఎ(ఐ మోనిటరీ అడ్వైజరీ) స్కాం లో ఇరుక్కున్న సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎం విజయశంకర్ ఆత్మహత్యకులు పాల్పడ్డాడు. బెంగళూరులోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణానికి ఒడిగట్టాడు. 

ఐఎంఏ స్కాంలో ప్రధాన నిందితుడైన మన్సూర్ ఖాన్ నుంచి కోటిన్నర లంచం తీసుకుని సదరు వ్యక్తికి క్లీన్ చీట్ ఇచ్చాడనేది  విజయ్ శంకర్ ఉన్న ప్రధాన ఆరోపణ. సిబిఐ అభియిగా పత్రంలో కూడా ఇదే విషయాన్నీ కీలకంగా పొందుపరిచారు. 

కుమారస్వామి హయాంలోని గత ప్రభుత్వం  విచారణలో సదరు అధికారిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ కేసులో తన పేరు బయటకు రావడం, అరెస్ట్ కూడా అవడం అన్ని వెరసి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అలా కృంగుబాటులోకి వెళ్లి ఆత్మహత్యకు ఒడిగట్టి ఉంటాడని కుటుంబసభ్యులు అంటున్నారు. రెండు వారాల క్రితమే కర్ణాటక ప్రభుత్వం విజయ్ శంకర్ ను విచారించేందుకు సిబిఐ కు అనుమతులిచ్చింది. 

ఇకపోతే సాధారణంగా ముస్లింలు వడ్డీలకు ఇవ్వరు. మన్సూర్ ఖాన్ తెలివిగా కొన్ని వేల మంది ముస్లిం ఇన్వెస్టర్ల నుండి డబ్బును సేకరించి అధిక మొత్తాల్లో తమ ఇన్వెస్టుమెంటును తిరిగి చెల్లిస్తానని నమ్మబలికాడు. 

తాను ఈ డబ్బును వడ్డీలకు కానీ, మద్యం అమ్మకాలకు వెచ్చించడం లేదని, దీనిద్వారా వ్యాపారం చేసి మీకు లాభాలను ఇస్తానని, ఇది పూర్తిగా "హలాల్" అని నమ్మబలికాడు. ఇలా దాదాపుగా 4వేల కోట్ల రూపాయల మేర సేకరించి బోర్డు తిప్పేసాడు. 

click me!