సీఏఏపై కేంద్రానికి కేరళ తర్వాత పంజాబ్ కేంద్రానికి షాక్

Published : Jan 17, 2020, 01:48 PM IST
సీఏఏపై కేంద్రానికి కేరళ తర్వాత పంజాబ్ కేంద్రానికి షాక్

సారాంశం

సీఏఏపై పంజాబ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. సీఏఏకు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం శానససభలో తీర్మానం చేసింది. సీఏఏ సమానత్వ హక్కును కాలరాచేదిగా ఉందని అభిప్రాయపడింది.

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ పంజాబ్ ప్రభుత్వం శాసనసభలో శుక్రవారం తీర్మానాన్ని ఆమోదించింది. సీఏఏను కొట్టివేయాలని పంజాబ్ ప్రభుత్వం ఆ తీర్మానంలో కోరింది. రెండు రోజుల శాసనసభ సమావేశాల్లో రెండో రోజు సీఏఏను వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి బ్రహ్మ్ మహీంద్ర శాసనసభలో తీర్మానాన్ని ప్రతిపాదించారు. 

కేరళ ప్రభుత్వం అంతకు ముందే అటువంటి తీర్మానం చేసింది. సీఏఏకు సవాల్ చేస్తూ పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం జనవరి 14వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

Also Read: ఔను, నేను పాకిస్తానీనే, ఏం చేసుకుంటారో చేసుకుండి: అధీర్ రంజన్ చౌధురి

భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వ హక్కును సీఏఏ ఉల్లంఘించేదిగా ఉందని అభిప్రాయపడింది. ఆర్టికల్ 131 కింద కేరళ ప్రభుత్వం ఆ పిటిషన్ ను దాఖలు చేసింది. ఆ చట్టం రాజ్యంగంలోని ఆర్టికల్స్ 14, 21, 25కు విరుద్ధంగా ఉందని ప్రకటించాలని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. 

ఆర్టికల్ 14 కింద సంక్రమించిన ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత సుప్రీంకోర్టుదని రాజ్యాంగంలోని 131 ఆర్టికల్ చెబుతుంది. ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని భావించినప్పుడు రాజ్యాంగంలోని 32 ఆర్టికల్ కింద ఎవరైనా సుప్రీంకోర్టు తలుపు తట్టవచ్చు. ఆర్టికల్ 14 సమానత్వ హక్కుకు గ్యారంటీ ఇస్తుంది   

Also Read: మర్యాద లేదా: పినరయి విజయన్ పై మండిపడ్డ గవర్నర్ ఆరిఫ్

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్