మా ప్రాంతాన్ని ఖాళీ చేయండి: రైతులపై స్థానికుల ఆగ్రహం, ఢిల్లీలో ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Jan 28, 2021, 6:17 PM IST
Highlights

దేశ రాజధాని సరిహద్దు ప్రాంతమైన సింఘా వద్ద ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. రైతులకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

దేశ రాజధాని సరిహద్దు ప్రాంతమైన సింఘా వద్ద ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. రైతులకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

క్యాంప్‌లు ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. గణతంత్ర దినోత్సవం నాడు శాంతియుత ర్యాలీకి అనుమతి తీసుకుని విధ్వంసాలకు తెగబడ్డారు రైతులు.

దీంతో రైతులపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ జెండాలు చేతబూనిన స్థానికులు తమ ప్రాంతం నుంచి రైతుల్ని తరిమేస్తామంటూ వచ్చారు. అయితే ఆందోళనకారుల్ని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.

Also Read:ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో హింసపై రైతు సంఘాల నేతలకు నోటీసులు: దీప్‌సిద్దు కోసం పోలీసుల గాలింపు

సంయమనం పాటించాల్సిందిగా స్థానికులను కోరాయి. దీంతో సింఘూ బోర్డర్ వద్ద ఉద్రిక్త పరిస్ధితులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ రోజు రాత్రి లోపు సరిహద్దు నుంచి వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ రైతులను ఆదేశించారు.

స్వయంగా వెళ్లకపోతే బలవంతంగా చేయించాల్సి ఉంటుందని కలెక్టర్ ఆదేశాల్లో తెలిపారు. కాగా, ఇవాళ మరో రెండు రైతు సంఘాలు ఆందోళన విరమించాయి.

ఆందోళన నుంచి వైదొలుగుతున్నట్లు కిసాన్ మహా పంచాయత్, భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించాయి. ఇప్పటికే రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, బీకేయూ సంఘాలు ఆందోళన విరమించాయి. 

click me!