
బెంగుళూరు: బెంగుళూరు విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నారు. పొట్టలో డ్రగ్స్ ను తరలిస్తున్న ఆఫ్రికన్ దేశస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.11 కోట్ల విలువైన కొకైన్ ఉన్నట్టుగా విమానాశ్రయ భద్రతా సిబ్బంది తెలిపారు. దుబాయ్ నుండి బెంగుళూరు వచ్చిన ఆఫ్రికన్ వ్యక్తి విమానంలో ఆహారం నీరు తీసుకోలేదు.
దీంతో అతడిపై భద్రతా సిబ్బందిని పోలీసులు అనుమానంతో ప్రశ్నించారు. అతనిని పోలీసులు స్కాన్ చేస్తే అతడి పొట్టలో కొకైన్ ను గుర్తించారు. దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి నిందితుడిని బెంగుళూరుకు తరలించినట్టుగా పోలీసులు తేల్చారు.