వీడో ఘరానా బుల్లోడు.. వయసు 26, నలుగురితో పెళ్లి, 53తో శృంగారం, లక్షల్లో మోసాలు.. !

Published : Jul 07, 2021, 04:06 PM IST
వీడో ఘరానా బుల్లోడు.. వయసు 26, నలుగురితో పెళ్లి, 53తో శృంగారం, లక్షల్లో మోసాలు.. !

సారాంశం

అతని వయసు 26 సంవత్సరాలే. కానీ, అతను చేసిన మోసాలు అన్నీ, ఇన్నీ కావు. ఆర్మీ ఆఫీసర్ నని చెప్పి నలుగురు యువతులను పెళ్లిళ్లు చేసుకున్నాడు. మరో 53మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. అంతేకాదు ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 20 మంది నుంచి లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు. 

చివరకు పోలీసుల చేతికి చికి జైలు పాలయ్యాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన యోగేష్ దత్తు గైక్వాడ్ అనే వ్యక్తి లీలలు పోలీసులకు కూడా షాకిస్తున్నాయి. తన పేరు రామ్ అని, తను ఆర్మీలో మేజర్ అని చెప్పుకుంటూ మహిళలతో పరిచయాలు పెంచుకునేవాడు యోగేష్. అతనికి బౌన్సర్ గా వ్యవహరిస్తూ ఈ కుట్రలో సహాయకుడిగా ఉన్నాడు అతని స్నేహితుడు సంజయ్.

ఏ మహిళను కలవడానికి వెళ్లినా యోగేష్ ఆర్మీ డ్రెస్ లోనే వెళ్లేవాడు. అతని వెంట సంజయ్ బాడీగార్డ్ గా ఉండేవాడు. ఇలా 53 మంది మహిళలతో యోగేష్ డేటింగ్ చేశాడు. అలాగే నలుగురు యువతులను ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్నాడు.

భార్యకు భర్త కన్యత్వ పరీక్ష.. పెళ్లైన మరుసటి రోజే..!

ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 20 మంది నుంచి లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బుతో జల్సా చేసేవాడు. అంతేకాదు వారికి ఫేక్ జాయినింగ్ లెటర్స్ కూడా ఇచ్చాడు. గత నెల 21న ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో యోగేష్ విషయం మొత్తం బయటపడింది. 

నిజానికి యోగేష్ మీద 2017లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పట్నుంచి తప్పించుకుని తిరుగుతూ తాజాగా దొరికిపోయాడు. అతడి నుంచి 12 జతల ఆర్మీ యూనిఫార్మ్స్ ను, 26 జతల షూస్ ను, రెండు రబ్బర్ స్టాంపులను, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu