ఏరో ఇండియా 2023: అద్భుతమైన విన్యాసాలతో షోస్టాపర్‌గా యూఎస్ ఎయిర్‌ఫోర్స్ ఎఫ్-35ఏ..!

Published : Feb 14, 2023, 06:01 PM ISTUpdated : Feb 14, 2023, 06:09 PM IST
ఏరో ఇండియా 2023: అద్భుతమైన విన్యాసాలతో షోస్టాపర్‌గా యూఎస్ ఎయిర్‌ఫోర్స్ ఎఫ్-35ఏ..!

సారాంశం

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా 2023 బెంగళూరులో కొనసాగుతుంది. రెండో రోజు అమెరికా ఫైటర్ జెట్‌ల ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. F-16 ఆకట్టుకోగా.. అయితే F-35A విన్యాసాలతో షోస్టాపర్‌గా నిలిచింది.

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా 2023 బెంగళూరులో కొనసాగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 14వ ఎడిషన్ ఏరో ఇండియా షోను బెంగళూరులోని యెలహంకలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఏరో ఇండియా 2023లో రెండో రోజు అమెరికా ఫైటర్ జెట్‌ల ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించి మా కరస్పాండెంట్ అందిస్తున్న కథనం వారి మాటల్లోనే.. నిరీక్షణ చాలా సేపు సాగింది. దూరంగా అమెరికా ఫైటర్స్‌ను పార్క్ చేసిన ఎన్‌క్లోజర్‌ వైపు చూపు మళ్లింది. 

అయితే పొరపాటుగా నిర్ణీత సమయానికి కంటే ముందుగా క్యూలో నిలబడటంతో కొంత సమయం వేచిచూడాల్సి వచ్చింది. F-35A లైట్నింగ్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను చూసేందుకు నేను మరికొన్ని గంటలు వేచి ఉండవలసి ఉందని గ్రౌండ్ సిబ్బంది నాకు తెలియజేయడంతో నాకు కొంత నిరాశ కలిగింది. నేను టార్మాక్ వెంట నడిచాను.. అమెరికన్ F/A-18 సూపర్ హార్నెట్‌లతో పాటుగా భారత వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన సుఖోయ్-30 ఎంకేఐ, తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను చూశాను. బ్రెజిలియన్ వైమానిక దళం హెవీ-లిఫ్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ల ధ్వనిని గ్రహించాను.

ఇంతలో అక్కడికి చేరుకునే జనం సంఖ్య వేగంగా పెరిగింది. యువకుల నుండి వృద్ధుల వరకు వందలాది మంది అమెరికన్ ఫైర్‌ పవర్‌ను గుర్తించగలిగే అత్యుత్తమ ప్రదర్శనను వీక్షించేందుకు ప్రయత్నించారు. ఉత్కంఠ స్పష్టంగా కనిపించింది. పైలట్లు, గ్రౌండ్ సిబ్బంది F-16, F-35 లను ప్రదర్శన కోసం సిద్ధం చేయడానికి చర్య తీసుకోవడంతో సందడి పెరిగింది. సిబ్బంది తమ విధిని నిర్వర్తించే వృత్తిపరమైన విధానం తప్పుపట్టలేనిది.

మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆకాశం దద్దరిల్లింది. అమెరికాకు చెందిన మొదటి జెట్‌లు F-16 ఫైటింగ్ ఫాల్కన్ ఆకాశంలోకి ఎగసింది. ఫైటర్ జెట్ అనేక విన్యాసాలను ప్రదర్శిస్తున్నప్పటికీ.. F-35A టేకాఫ్ కోసం ఎదురుచూపులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే దాదాపు 10 నిమిషాల తర్వాత క్షణం వచ్చింది. ఉటాలోని హిల్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరిన ప్రదర్శన బృందం నుంచి F-35A లైటెనింగ్ II రన్‌వేపైకి వెళ్లినప్పుడు.. వెంటనే తలలు తక్షణమే అటువైపు మారిపోయాయి. F-16 ఆకట్టుకుంది.. అయితే F-35A షోస్టాపర్‌గా ఉంది. అది నిరీక్షణకు తన అనుభూతిని కలిగించింది. 

కెమెరాలు వీడియో మోడ్‌లో ఉన్నాయి.ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ కావడానికి వేగం పుంజుకున్నప్పుడు జనాలు ఉత్సాహంతో అరవడం కనిపించింది. శక్తిమంతమైన ప్రాట్, విట్నీ F135 ఇంజిన్ కలిగిన F-35A ఆకాశంలోకి దూసుకుపోతున్నప్పుడు శరీరంపై వణుకు పుట్టించింది. 

F-35A.. యూఎస్ వైమానిక దళంలోని అత్యంత అధునాతన స్టెల్త్ ఫైటర్ విమానం. రన్‌వే మీదుగా ఒక సమయంలో దాని ఆయుధాల బేను ప్రదర్శించింది. ఇది బహుళ స్పిన్‌లు, లూప్‌లను చేపట్టడం ప్రారంభించింది. ఆఫ్టర్‌బర్నర్‌లు ప్రారంభించిన ప్రతిసారీ.. F-35A పోరాట సామర్థ్యాలు తెరపైకి వచ్చాయి. యూఎస్ వైమానిక దళం గర్వం మరింత పెరిగింది. ఆపై బహుళ విన్యాసాలతో కూడిన సాహసకృత్యాలను అమలు చేసింది.

ఎవరూ తమ స్థలం నుండి కదలలేదు. విమానం ఎక్కడికి వెళ్లినా కళ్లు వెంబడించాయి. ఈ కరస్పాండెంట్‌తో సహా కొందరికి ఇది ఎంతో సంతోషించాల్సిన క్షణం. ఇలాంటి క్షణాలు ప్రతిరోజు చోటుచేసుకోవు. తర్వాతి సారి వరకు...

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !