ఒక సైకిల్ ఒకేసారి ఇద్దరు తొక్కడం ఎప్పుడైనా చూశారా?

Published : Jun 01, 2023, 11:13 AM IST
ఒక సైకిల్ ఒకేసారి ఇద్దరు తొక్కడం ఎప్పుడైనా చూశారా?

సారాంశం

అలా తొక్కే సమయంలో కూడా వారు ఎలాంటి తడబాటు పడకపోవడం గమనార్హం. వారు చాలా సంతోషంగా, ఉత్సాహంగా కనిపించడం విశేషం.  

సైకిల్ ఎవరైనా తొక్కతారు. ఒకే సైకిల్ ఇద్దరు తొక్కడం కూడా మీరు చూసుంటారు. కానీ ఒకేసారి ఇద్దరు సైకిల్ తొక్కడం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూడండి. టీమ్ వర్క్ గురించి వినే ఉంటారు. అసలైన టీమ్ వర్క్ కి అర్థం కూడా మీకు ఈ వీడియో చూస్తే అర్థమౌతుంది.

ప్రస్తుతం ట్విట్టర్ లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు ఒకేసారి రెండు పెడల్స్ ఉన్న సైకిల్ ని ఒకేసారి తొక్కడానికి ప్రయత్నించడం విశేషం. అలా తొక్కే సమయంలో కూడా వారు ఎలాంటి తడబాటు పడకపోవడం గమనార్హం. వారు చాలా సంతోషంగా, ఉత్సాహంగా కనిపించడం విశేషం. ఇది ఎక్కడ జరిగింది అనే విషయం మాత్రం తెలియదు కానీ  నెట్టింట మాత్రం తెగ ఆకట్టుకుంటోంది.

 


ఈ వీడియో కి 1.7 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఇక కామెంట్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కామెంట్ల వర్షం కురుస్తోంది.ఆ పిల్లలను చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. చిన్నతనంలో తాము కూడా ఇలానే చేశాం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి కొందరు అసలైన టీమ్ వర్క్ అంటే ఇది అంటూ కామెంట్స్  చేస్తుండటం విశేషం.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?