Aditya Tackeray: పాకిస్తాన్‌పై బీజేపీవి రాజకీయాలంటున్న ఆదిత్య ఠాక్రే

Bhavana Thota   | ANI
Published : May 20, 2025, 06:08 AM IST
Shiv Sena (UBT) MLA  Aditya Thackeray (File Photo/ANI)

సారాంశం

పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో బీజేపీ రాజకీయాలు చేస్తోందని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే ఆరోపించారు. ప్రతిపక్షాల మద్దతు ఉన్నప్పటికీ బీజేపీ ఇలా చేయడం సరికాదన్నారు.

ముంబై : పాకిస్తాన్‌తో ఇటీవలి ఉద్రిక్తతలపై బీజేపీ "రాజకీయాలు" చేస్తోందని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే ఆరోపించారు. ప్రతిపక్షాల మద్దతు ఉన్నప్పటికీ బీజేపీ ఇలా చేయడం సరికాదన్నారు.పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తున్నామని ప్రతిపక్షాలు పదే పదే చెబుతున్నాయని, భారతదేశ బలాన్ని చూపించాల్సిన సమయం ఆసన్నమైందని, ఉగ్రవాదంపై పోరాటంలో అన్ని పార్టీలు "కలిసి" ఉంటాయని ఠాక్రే చెప్పుకొచ్చారు.

"మొదటి రోజు నుంచే మా వైఖరి స్పష్టంగా ఉంది... ప్రధానితో కలిసి ఉన్నామని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకతాటితో చెప్పాయి. పాకిస్తాన్‌కు మన బలం ఏంటో చూపించాలి. ఉగ్రవాదంపై పోరాటం చేస్తాం. కలిసి ఉంటాం. కానీ ఎక్కడో వాళ్ళు (బీజేపీ) రాజకీయాలు మొదలుపెట్టారు... అన్ని పార్టీలను కలిసి ఉంచాలి. విదేశాంగ మంత్రి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, ప్రపంచవ్యాప్తంగా అన్ని పార్టీల ప్రతినిధులను ఎందుకు పంపాల్సి వచ్చిందో వివరించాలి. పహల్గాంలోకి ఉగ్రవాదులు ఎలా వచ్చారనే దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు" అని ఆదిత్య ఠాక్రే అన్నారు.


ఇదిలా ఉండగా, సోమవారం లోక్‌సభ లో రాహుల్ గాంధీ మరోసారి ఎస్ జైశంకర్‌ను ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళానికి ఎన్ని విమానాలు నష్టపోయాయో చెప్పాలని అడిగారు.ఇది పొరపాటు కాదు. ఇది నేరం. దేశానికి నిజం తెలుసుకోవలసిన హక్కు ఉంది" అని రాహుల్ గాంధీ Xలో పోస్ట్ చేశారు.
ఈ వ్యాఖ్యలు బీజేపీ నుంచి విమర్శలను రేకెత్తించాయి. రాహుల్ గాంధీ "పాకిస్తానీ భాష" మాట్లాడుతున్నారని పలువురు నాయకులు ఆరోపించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం