ఆదిత్య-ఎల్1 : రెండో ఎర్త్ బౌండ్ విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మిషన్

Published : Sep 05, 2023, 10:59 AM IST
ఆదిత్య-ఎల్1 : రెండో ఎర్త్ బౌండ్ విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మిషన్

సారాంశం

ఇస్రో చేపట్టిన తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 మిషన్ విజయవంతంగా సాగిపోతోంది. అందులో భాగంగా మంగళవారం తన  ఎర్త్ బౌండ్ విన్యాసాన్ని పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఇస్రో ప్రకటించింది.

భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు  రెండో ఎర్త్ బౌండ్ విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ప్రయోగ రోజున బెంగళూరులోని ఇస్ట్రాక్ నుంచి తొలి ఎర్త్ బౌండ్ విన్యాసాన్ని (ఈబీఎన్#1)ను విజయవంతంగా నిర్వహించారు. కాగా.. తదుపరి విన్యాసం (ఈబీఎన్#3) సెప్టెంబర్ 10వ తేదీన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 02:30 గంటలకు జరుగుతుందని అంతరిక్ష సంస్థ తెలిపింది.

‘‘బెంగళూరులోని ఇస్ట్రాక్ నుంచి రెండో ఎర్త్ బౌండ్ యుక్తి (ఈబీఎన్-2)ను విజయవంతంగా నిర్వహించారు. మారిషస్, బెంగళూరు, పోర్ట్ బ్లెయిర్ లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు ఈ ఆపరేషన్ సమయంలో ఉపగ్రహాన్ని ట్రాక్ చేశాయి. కొత్త కక్ష్య 282 కి.మీ x 40225 కి.మీగా ఉంటుంది’’ అని ఇస్రో తన అధికారిక ఎక్స్ పేజీలో (ట్విట్టర్ )లో పోస్టు చేసింది.

సూర్యుడిపై భారత మొట్టమొదటి మిషన్ ఆదిత్య -ఎల్ 1 సెప్టెంబర్ 2 న ఉదయం 11:50 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుండి బయలుదేరింది. దీని ప్రయాణ సమయం మొత్తం 125 రోజులుగా ఉంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశంలోని మరో ఆరు సంస్థలతో కలిసి ఈ మిషన్ ను చేపట్టింది. 

ఆదిత్య-ఎల్ 1 మిషన్ సూర్యుడిని అధ్యయనం చేసిన మొదటి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ-క్లాస్ భారతీయ సోలార్ మిషన్. దీనిని సూర్య-భూమి వ్యవస్థ లాగ్రాంజియన్ బిందువు (ఎల్ 1) చుట్టూ హాలో కక్ష్యలో ఉంచుతారు. విద్యుదయస్కాంత, కణ, అయస్కాంత క్షేత్ర డిటెక్టర్లను ఉపయోగించి సూర్యుడి ఫోటోస్ఫియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బాహ్య పొరలను (కరోనా) పరిశీలించడం ఈ మిషన్ లక్ష్యం. కాగా.. అంతరిక్షంలో ఆదిత్య ఎల్1 గమ్యస్థానానికి చేరుకోవడానికి సుమారు నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ స్థితికి చేరుకున్న తరువాత భారత్ ఐదు సంవత్సరాల వరకు సూర్యుడిని అధ్యయనం చేయగలదు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌