కరోనా వైరస్ మహమ్మారి మనకు కంటికి కనపడకపోవచ్చు (ఇన్ విజిబుల్) కానీ మన కరోనా యోధులు మాత్రం అద్వితీయులు( ఇన్ విన్సిబుల్) అని అన్నారు నరేంద్ర మోడీ. భారత్ దశలవారీగా లాక్ డౌన్ ను సడలిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలను చేసారు.
కరోనా వైరస్ మహమ్మారి మనకు కంటికి కనపడకపోవచ్చు (ఇన్ విజిబుల్) కానీ మన కరోనా యోధులు మాత్రం అద్వితీయులు( ఇన్ విన్సిబుల్) అని అన్నారు నరేంద్ర మోడీ. భారత్ దశలవారీగా లాక్ డౌన్ ను సడలిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలను చేసారు.
కర్ణాటక లోని యూనివర్సిటీ సిల్వర్ జూబిలీ వేడుకలను ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఆ ప్రారంభిత్సవం సందర్భంగా ప్రధాని కొద్దిసేపు ప్రసంగించారు.
ప్రపంచమంతా కరోనా కష్టకాలంలో డాక్టర్లనుంచి కేర్, క్యూర్ ని ఆశిస్తుందని అన్నారు ప్రధాని. ప్రపంచంలోనే ఆధ్య్నత ఎక్కువమందికి వర్తించే హెల్త్ స్కీం ఆయుష్మాన్ భారత్, భారతదేశంలో ఉందని, రెండు సంవత్సరాల కాలంలో కోటి మంది ప్రజలు ఈ స్కీం ద్వారా లబ్ది పొందారని అన్నారు ప్రధాని. ముఖ్యంగా మహిళలు, ప్రాంతాల్లోని వారు ఈ స్కీం వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందారని అన్నారు ప్రధాని.
కరోనా యోధులపై ఎటువంటి దాడులకు, పాల్పడ్డ చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు ప్రధాని. భారత దేశంలో అతితక్కువ సమయంలో 22 కొత్త ఎయిమ్స్ లను ఏర్పాటు చేశామని, దేశవ్యాప్తంగా 30 వేల సీట్లను ఎంబిబిఎస్ లో, 15 వేల సీట్లను పీజీ కోర్సుల్లో పెంచమని అన్నారు ప్రధాని.
ఇకపోతే... కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మరిన్ని సడలింపులతో లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరిన్ని సడలింపులతో జూన్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించింది. దేశవ్యాప్తంగా జూన్ 8 నుండి దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు, హోటల్లు, రెస్టారెంట్, మాల్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతించారు. అలాగే రాష్ట్రాల అనుమతితో అంతర్రాష్ట్ర ప్రజారవాణా, సరుకు రవాణా చేసుకోవచ్చని తెలిపింది.
ఇక విద్యాసంస్థలపై నిర్ణయాన్ని కూడా కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. పరిస్థితులను బట్టి జూలై నుండి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవచ్చని తెలిపింది. అయితే విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటిస్తూ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత విద్యాసంస్థలదేనని... అందుకు సంబంధించిన నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలకు సూచించారు.
కంటైన్మెంట్ జోన్లలో పూర్తి స్ధాయి లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా తీవ్రత అధికంగా వున్న ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాత్రివేళల్లో కర్ఫ్యూను కూడా సడలించారు. ఇప్పటిలా 7 గంటల నుండి కాకుండా రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు.
ఇక జూన్ 8 తర్వాత సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు, పార్కులు, బార్లు, మెట్రో రైల్లు, జిమ్ లు, ఆడిటోరియంలను తెరించేందుకు అనుమతినివ్వలేదు. సభలు,సమావేశాలు మరీ ముఖ్యంగా రాజకీయ, మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేదం కొనసాగనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేదం కొనసాగనుంది.