బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై నటి జమీలా జామిల్ విమర్శలు.. బూతులు ఉపయోగించి మరీ..

Published : Jan 07, 2023, 01:29 PM ISTUpdated : Jan 07, 2023, 01:30 PM IST
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై నటి జమీలా జామిల్ విమర్శలు.. బూతులు ఉపయోగించి మరీ..

సారాంశం

బ్రిటన్ ప్రధానిపై హాలీవుడ్ నటి జమీలా జామిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులతో దూషించింది. రిషి బిలియనీర్ అని అందుకే సామాన్యుల బాధలు తెలివని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. 

భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై షీ-హల్క్ నటి జమీలా జమీల్ తీవ్ర విమర్శలు చేశారు. తన  ఇన్‌స్టాగ్రామ్ వేధికగా బూతులను ఉపయోగిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఓ పోస్ట్ లో.. రిషి ఉన్నత కుటుంబానికి చెందిన వాడని పేర్కొంది. రైట్ వింగ్ పర్సన్ అని, అదృష్టం కలిసి వచ్చి పీఎంగా ఎన్నికయ్యారని విమర్శించారు. 

యునైటెడ్ కింగ్‌డమ్ కొత్త పీఎం అయిన రిషి సునక్.. దేశంలో సమ్మెలు, నిరాహార దీక్షలు చేయకుండా ఉండేందుకు ఓ కొత్త యాక్ట్ ను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటి జమీలా జామిల్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించాలని అనుకుంటోంది. ఇది సరైన నాయకత్వం కాదు. ఇక్కడి ప్రజలు తమకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని సమ్మె చేస్తున్నారు. కానీ ఈ బిలియనీయర్ వారిని నిరసన తెలపకుండా చేయాలని అనుకుంటున్నాడు. కానీ మేము అలా జరగనివ్వము’’ అని పేర్కొంది. 

ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ పెట్టింది, అది తిని మరణించింది.. దర్యాప్తునకు ఆదేశించిన కేరళ మంత్రి

ఎవరీ జమీలా జమీల్ ?
జమీలా నటి, వ్యాఖ్యాత.  ఆమె పాప్ కల్చర్ సిరీస్‌కు హోస్ట్ గా వ్యవహరించడంతో తన కెరీర్ ప్రారంభమైంది. ఆమె బీబీసీ రేడియో 1 చార్ట్ షోకు మొదటి సోలో మహిళా వ్యాఖ్యాతగా పని చేశారు. 2016లో జమీలా అమెరికాకు మకాం మార్చింది. ఆమె ఎన్ బీసీ ఫాంటసీ కామెడీ సిరీస్ ది గుడ్ ప్లేస్‌లో తహానీ అల్-జమీల్ పాత్రను పోషించింది. 2022లో ఆమె యానిమేటెడ్ ఫిల్మ్ డీసీ లీగ్ ఆఫ్ సూపర్-పెట్స్, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ టెలివిజన్ సిరీస్ షీ-హల్క్: అటార్నీ ఎట్ లాలో నటించారు. కాగా.. ఆమె గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu