మీకో దండం, నేను ఏపార్టీలో చేరడం లేదు: స్టార్ హీరోయిన్ క్లారిటీ

Published : Sep 17, 2019, 05:53 PM ISTUpdated : Sep 17, 2019, 05:57 PM IST
మీకో దండం, నేను ఏపార్టీలో చేరడం లేదు: స్టార్ హీరోయిన్ క్లారిటీ

సారాంశం

శివసేనలో చేరుతున్నారంటూ వస్తోన్న వార్తలు సరికాదన్నారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరడం లేదంటూ మీడియాకు తెలిపారు. బయటి వ్యక్తుల ద్వారా విన్న విషయాలను ప్రచారం చేయోద్దంటూ మీడియాను కోరారు.   

ముంబై: శివసేన పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు స్టార్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్. తాను ఏ పార్టీలో చేరడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశానని ప్రస్తుతానికి ఇక ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదన్నారు.  

శివసేనలో చేరుతున్నారంటూ వస్తోన్న వార్తలు సరికాదన్నారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరడం లేదంటూ మీడియాకు తెలిపారు. బయటి వ్యక్తుల ద్వారా విన్న విషయాలను ప్రచారం చేయోద్దంటూ మీడియాను కోరారు. 

ఏదో ఓ పార్టీలో చేరుతున్నాని ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం నేను ఏ పార్టీలో చేరాలనుకోవడం లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు నటి ఊర్మిళ. ఇకపోతే ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు నటి ఊర్మిళ. 

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే పీఏ మిలింద్‌ నవ్రేకర్‌తో ఆమె భేటీ అయ్యారు. దాంతో ఆమె శివసేనలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాంతో ఊర్మిళ మీడియాకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఇకపోతే ఈ ఏడాది మార్చి నెలలో ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ముంబై నార్త్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్ షెట్టి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 

కాంగ్రెస్ పార్టీలోని వర్గపోరు నేపథ్యంలో ఈనెల 10న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఊర్మిళ. సమున్నత లక్ష్యం కోసం కాంగ్రెస్‌లో తాను పనిచేయాలనుకున్నానని, అయితే అంతర్గత రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అందువల్లే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఊర్మిళ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ పార్టీకి స్టార్ హీరోయిన్ గుడ్ బై

ఆర్టికల్ 370 రద్దు.. మా అత్తమామలతో మాట్లాడి 22రోజులౌతోంది.. ఊర్మిళ ఆవేదన

నా ప్రాణానికి ముప్పు ఉంది.. ఊర్మిళ షాకింగ్ కామెంట్స్

కాంగ్రెస్ లో చేరిన సినీ నటి ఊర్మిళ

PREV
click me!

Recommended Stories

Republic Day 2026: PM Modi Welcomes President Murmu and EU Leaders at Delhi | Asianet News Telugu
Republic Day 2026 Delhi: గణతంత్ర వేడుకల్లో విన్యాసాల తోఅదరగొట్టిన భారత వాయుసేన | Asianet News Telugu