సంజయ్ రౌత్ ఘాటు విమర్శలు: ఎట్టకేలకు ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన సోనూసూద్

Published : Jun 08, 2020, 09:34 AM IST
సంజయ్  రౌత్ ఘాటు విమర్శలు: ఎట్టకేలకు ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన సోనూసూద్

సారాంశం

సినిమా యాక్టర్ సోనూసూద్, తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని ఆయన అధికారిక నివాసం మాతోశ్రీలో కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను ఆదిత్య ఠాక్రే ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. 

చిక్కుకున్న వలస కార్మికులను తమతమ సొంత రాష్ట్రాలకు పంపిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నం సినిమా యాక్టర్ సోనూసూద్, తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని ఆయన అధికారిక నివాసం మాతోశ్రీలో కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను ఆదిత్య ఠాక్రే ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. 

అంతకు ముందు శివసేన అధికారిక పత్రిక సామ్నాలో రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సోనూసూద్ పై తీవ్రంగా విమర్శలు చేసాడు. సినెమళ్ళూ ఎవరో రాసిన డైలాగులు, స్క్రిప్టులు చదివి వాటితో పొట్టనింపుకునే సోనూసూద్ లాంటివాళ్లు ఎందరో డబ్బులిస్తే ఏ పార్టీనైనా సమర్థిస్తారని అన్నారు. 

ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన తరువాత తనకు సంజయ్ రౌత్ వ్యాఖ్యలను ఖండిస్తూ... దేశంలోని అన్ని పార్టీలు తనకు మద్దతిచ్చాయని అన్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాజకీయ పార్టీలు తనకు ముఖ్అద్దతిచ్చాయని అన్నాడు. 

ఇక నిన్న సోనూసూద్ ఉద్ధవ్ అధికారిక నివాసం మాతోశ్రీకి చేరుకోగానే..."చివరకు సోను సూద్ కి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అడ్రస్ దొరికినట్టుంది... జై మహారాష్ట్ర" అని మరాఠీలో ట్వీట్ చేసారు. 

PREV
click me!

Recommended Stories

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo