దేశంలో 2.5లక్షల కరోనా కేసులు.. చైనాని దాటేసిన మహారాష్ట్ర

By telugu news teamFirst Published Jun 8, 2020, 8:56 AM IST
Highlights

తాజా కేసులతో మహారాష్ట్ర.. పొరుగుదేశం చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటి వరకు 83,036 కేసులు నమోదు కాగా, అత్యధిక కేసులు కలిగిన దేశాల జాబితాలో చైనా 18వ స్థానంలో ఉంది. భారత్ ఆరో స్థానంలో ఉంది.

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఊహించని విధంగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే రెండున్నర లక్షల కేసులతో భారత్‌ ఇటలీని దాటేసి రికార్డులకెక్కగా.. తాజాగా మహారాష్ట్ర కూడా ఓ రికార్డును నమోదు చేసింది.

గత 24 గంటల్లో మహారాష్ట్రంలో ఏకంగా 3,007 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 85,975కు చేరుకుంది. అలాగే, ఇప్పటి వరకు 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక, దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 2.5 లక్షలు దాటేసింది. 

తాజా కేసులతో మహారాష్ట్ర.. పొరుగుదేశం చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటి వరకు 83,036 కేసులు నమోదు కాగా, అత్యధిక కేసులు కలిగిన దేశాల జాబితాలో చైనా 18వ స్థానంలో ఉంది. భారత్ ఆరో స్థానంలో ఉంది.

తమిళనాడులో కొత్తగా 1,515 కేసులు నమోదు కాగా, 18 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 31,667 కేసులు నమోదయ్యాయి. 269 మంది మరణించారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 27,654 కేసులు నమోదు కాగా, 761 మంది మరణించారు. గుజరాత్‌లో 19,592 కేసులు నమోదయ్యాయి.

 ఇప్పటి వరకు 1219 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఉత్తరప్రదేశ్ కొత్తగా 433 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,536కు పెరిగింది.

ఇక దేశ వ్యాప్తంగా 6929 మంది మరణించగా..  ఒక్క మహారాష్ట్రలోనే ఆ సంఖ్య మూడు వేలుగా ఉంది. ఆదివారం సాయంత్రం నాటికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 70 లక్షల 26 వేలకు చేరగా.. 34 లక్షల 35 వేల మంది కోలుకున్నారు. 

కాగా, 2,34,801 కేసులతో ఇటలీ ఏడో స్థానంలో ఉండగా.. 2,54,242 కేసులతో భారత్‌ ఆరో స్థానంలో కొనసాగుతోంది. దేశంలో 82 వేల కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో, 30 వేల కేసులతో తమిళనాడు రెండో స్థానంలో, 27 వేల కేసులతో ఢిల్లీ, 19 వేల కేసులతో గుజరాత్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
 

click me!