ఆన్ లైన్ లో మద్యం... బాలీవుడ్ నటికి షాక్..!

Published : Jun 25, 2021, 07:51 AM IST
ఆన్ లైన్ లో మద్యం... బాలీవుడ్ నటికి షాక్..!

సారాంశం

ఆమె ఆన్ లైన్ లో మద్యం కొనుగోలు చేశారు. కాగా... పేమెంట్ కూడా ముందే చేసేశారు. అయితే.. మద్యం డెలివరీ అవ్వాల్సిన సమయం దాటిపోయినా.. అది మాత్రం ఇంటికి  చేరలేదు. 

ప్రస్తుత కాలంలో చాలా మంది షాపింగ్ లకు వెళ్లి కొనుక్కునే బదులు.. ఆన్ లైన్ లోనే షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు.  ఇక కరోనా వచ్చిన తర్వాత.. ఆన్ లైన్ షాపింగ్ చాలా సురక్షితమని వారు భావిస్తున్నారు.  అయితే.. అప్పుడప్పుడు ఈ ఆన్ లైన్ షాపింగ్ కారణంగా... చాలా మంది మోసపోతున్నారు కూడా..తాజాగా.. ఇదే అనుభవం బాలీవుడ్ నటి షబానా అజ్మీకి ఎదురైంది.

ఆమె ఆన్ లైన్ లో మద్యం కొనుగోలు చేశారు. కాగా... పేమెంట్ కూడా ముందే చేసేశారు. అయితే.. మద్యం డెలివరీ అవ్వాల్సిన సమయం దాటిపోయినా.. అది మాత్రం ఇంటికి  చేరలేదు. దీంతో.. మోసపోయానని ఆమె గ్రహించడం గమనార్హం.

ఈ రకంగా మరెవరూ మోసపోకూడదని భావించి ఆ సంస్థ పేరు తెలుపుతూ తను లావాదేవీ జరిపిన ఫోటోని తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. 
 "జాగ్రత్తగా ఉండండి, నన్ను వాళ్లు మోసం చేశారు. # లిక్విడ్జ్ లైవింగ్‌కు ముందే నేను డబ్బును చెల్లించాను, అనంతరం నేను పెట్టిన ఆర్డర్ రాకపోవడంతో కాల్‌ చేస్తుంటే ఎటువంటి సమాచారం లేదని’ తెలిపింది. అయితే, ఆమె ఎంత మొత్తంలో పంపిందనే విషయాన్నితెలపలేదు. గతంలో కూడా అక్షయ్ ఖన్నా, నర్గిస్ ఫఖ్రీ, కరణ్ సింగ్ గ్రోవర్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం ఇటువంటి వాటిలో మోసపోయారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu