
ముంబై: నటుడు, మోడల్ ఆదిత్య సింగ్ రాజ్ పుట్ సోమవారంనాడు తన అపార్ట్ మెంట్ లో మృతి చెందాడు. అతని వయస్సు 32 ఏళ్లు. ఆదిత్య సింగ్ మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆదిత్య మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఆదిత్య రాజ్ పుట్ ఆరోగ్యం సరిగా లేదని ప్రచారం సాగుతుంది. రెండు రోజులుగా ఆదిత్య అనారోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు. ముంబైలోని ఒపివారాలో లో గల అపార్ట్ మెంట్ బాత్ రూమ్ లో ఆదిత్య రాజ్ పుట్ కుప్పకూలాడని ఓ అధికారి తెలిపారు.
ఆదిత్య తన అపార్ట్ మెంట్ లో పడిపోవడాన్ని పనిమనిషి గుర్తించి సెక్యూరిటీ గార్డుకు సమాచారం అందించారు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందారని వైద్యులు ప్రకటించారు.
రాజ్ పుట్ మృతిపై తమకు ఇప్పటివరకు కారణాలు తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. ఆదిత్య తన కెరీర్ ను మోడలింగ్ ద్వారా ప్రారంభించారు. క్రాంతివీర్, మైనే గాంధీకో నహిన్ మారా వంటి సినిమాల్లో నటించాడు.స్ప్లిట్ విల్లా 9 రియాలిటీ షో కూడా ఆదిత్య రాజ్ పుట్ భాగస్వామయ్యాడు.లవ్, ఆషికి , కోడ్ రెడ్ , ఆవాజ్ సీజన్ ు, బ్యాడ్ బాయ్ సీజన్ 4 వంటి టీవీ షోల్లో కూడా ఆదిత్య రాజ్ పుట్ నటించాడు.