New Delhi: భారత్ లో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు 10,000 మార్కును దాటాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.02 శాతం ఉండగా, జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.79 శాతంగా నమోదైంది.
COVID-19 update india: దేశంలో వరుసగా రెండో రోజు 1,800కు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు 10,000 మార్కును దాటాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.02 శాతం ఉండగా, జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.79 శాతంగా నమోదైంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక డేటా ప్రకారం.. దేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు మరణాలు సైతం పెరుగుతున్నాయి. సోమవారం 1,805 కొత్త కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో కోవిడ్ యాక్టివ్ కేసులు ఇప్పుడు 10,300కు చేరుకున్నాయి. ఇది మొత్తం కేసుల్లో 0.02 శాతం కాగా, కరోనా వైరస్ రికవరీ రేటు ప్రస్తుతం 98.79 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ తో పోరాడుతూ ఆరుగురు మరణించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
undefined
ప్రస్తుతం భారత్ లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,837కు చేరుకుంది. సోమవారం ఉదయం 8 గంటలకు అప్డేట్ చేసిన డేటా ప్రకారం పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లలో 24 గంటల వ్యవధిలో ఒక్కొక్కరు కరోనా వైరస్ కారణంగా మరణించగా, కేరళలో ఇద్దరు మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేటు 1.39 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 932 మంది కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 4,41,64,815కి చేరింది. రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో మొత్తం 1,743 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి.
రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్..
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాప్తి అడ్డుకోవడంతో పాటు నివారణ చర్యలు, ప్రస్తుత పరిస్థితులపై ఇదివరకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇదే క్రమంలో మరోసారి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమీక్ష నిర్వహించనుంది. దీని కోసం సోమవారం నాడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
గత వారం నుంచి పెరుగుదల అధికం..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశంలో ఆదివారం 1,890 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. గత 149 రోజులలో అత్యధికం కావడం వల్ల యాక్టివ్ కేసులు 9,433 కు పెరిగాయి. దేశంలో చివరిసారిగా 2022 అక్టోబర్ 28న ఒక్కరోజులో 2,208 కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ 1.56 శాతం, వీక్లీ పాజిటివిటీ 1.29 శాతంగా నమోదైంది. గత ఏడు రోజులతో పోలిస్తే.. ఒక్క వారంలోనే కొత్త కేసులు ఏకంగా 78 శాతం పెరిగాయి. ఇదే సమయంలో దేశంలో 29 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబర్ 22 తర్వాత దేశంలో 1,988 కొత్త కేసులు నమోదైన తర్వాత శనివారం నమోదైన కేసుల సంఖ్య ఇదే అత్యధికమని కేంద్ర మంత్రిత్వ శాఖ కోవిడ్-19 నివేదికలు పేర్కొంటున్నాయి. గత ఏడు రోజుల్లో (మార్చి 19-25) భారతదేశంలో 8,781 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. అంటే గత ఏడు రోజుల్లో 4,929 నుండి 78 శాతం కేసులు పెరిగాయి. అంతకుముందు వారంలో కనిపించిన 85 శాతం పెరుగుదలతో ఇది పోల్చదగినది.