
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ నుంచి రుణం తీసుకున్న వ్యక్తి మళ్లీ తిరిగివ్వడం లేదని ఆ ఇద్దరూ ఓ స్కెచ్ వేశారు. ఆ వ్యక్తిని చంపేయాలని అనుకున్నారు. దారుణంగా హతమార్చారు. అనంతరం, వుడ్ కట్టర్‌తో బాడీని ముక్కలుగా నరికేశారు. ఈ కేసులో ఓ నిందితుడు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
45 ఏళ్ల అనుపమ్ శర్మ ఫిబ్రవరి 16వ తేదీ నుంచి కనిపించడం లేదు. అనంతరం, మిస్సింగ్ కేసు ఫైల్ అయింది.చివరిసారిగా ఆయనతో కనిపించిన (సీసీటీవీ ఆధారంగా) ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సంజీవని నగర్‌లోని డ్రైనేజీలో మూడు ప్లాస్టిక్ బ్యాగుల్లో అనుపమ్ శర్మ డెడ్ బాడీ ఆదివారం బయటపడింది.
రామ్ ప్రకాశ్ పునియా, వినోద్ వర్మ అలియాస్ టోనీలు మిత్రులు. వీరిద్దరూ అనుపమ్ శర్మకు డబ్బులు రుణంగా ఇచ్చారు. కానీ, అనుపమ్ శర్మ ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. దీంతో వారిద్దరూ కలిసి అనుపమ్ శర్మను చంపేయాలని అనుకు న్నారు. అనుకున్నట్టే అనుపమ్ శర్మను చంపేసి ముక్కలుగా నరికి డ్రైనేజీలో వేశారు.
Also Read: రాజకీయాలు మాట్లాడుకుంటూ ఒకరి పై ఒకరు దాడి.. ఘర్షణలో ఒకరు మృతి
ఈ ఘటన తర్వాత నిందితుడు వినోద్ వర్మ తీవ్రంగా కలత చెందాడు. తాను పెద్ద తప్పు చేసినట్టు లేఖలో పేర్కొని వినోద్ వర్మ ఆత్మహత్య చేసుకుంది.రామ్ ప్రకాశ్ పూనియాను పోలీసులు పట్టుకున్నారు.