
గతంలోనూ Mi-17v5 హెలిక్యాప్టర్ల ప్రమాదాలు..
బుధవారం జరిగిన హెలిక్యాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారన్న వార్త దేశం మొత్తం కలంకలం రేపింది. సుధీర్ఘ కాలం పాటు భారత సైన్యంలో పని చేసి దేశానికి సేవ చేసిన బిపిన్ రావత్ మరణం పట్ల దేశం ద్రిగ్భాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటన తెలిసిన వెంటనే కేంద్ర కేబినేట్ అత్యవసరంగా భేటీ అయ్యింది. ప్రమాదం వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. పార్లమెంట్ లో ఈ ఘటనపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధికారిక ప్రకటన చేశారు. దేశం గొప్ప దేశభక్తుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.హెలిక్యాప్టర్ ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ప్రమాదానికి గురైన Mi-17v-5 హెలిక్యాప్టర్ బ్లాక్ బాక్స్ ను అధికారులు ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. అందులోని సమాచారాన్ని విశ్లేషించిన తరువాతే అసలేం జరిగిందన్నదానిపై స్పష్టత వస్తుంది. అయితే బుధవారం Mi-17v-5 హెలిక్యాప్టర్ సిరీస్ కు చెందిన హెలిక్యాప్టర్ లు గతంలోనూ పలు ప్రమాదాలకు గురయ్యాయి.
బిపిన్ రావత్ మంచినీళ్లు అడిగాడు.. రాత్రంతా నిద్ర పట్టలేదు.. ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
2010లో మొదటి సారి..
Mi-17v5 సీరీస్ హెలిక్యాప్టర్‌లు భారతదేశ రక్షణకు ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నాయి. డ్యూయల్ ఇంజన్ కలిగి ఉండే ఈ హెలిక్యాపర్లు అత్యంత శక్తివంతమైనవి. అత్యంత ఎత్తైన చెట్ల మధ్య కూడా సైనికులు అవసరమైన బరువైన వస్తువులు, సరుకులు తీసుకెళ్లగలుగుతుంది. ఇవి అత్యంత సురక్షితమైనవి కూడా. అందుకే దీనిని ప్రధాని, ఇతర వీఐపీల ప్రయాణానికి ఉపయోగిస్తారు. కానీ హెలిక్యాప్టర్లు కూడా గతంలో కొన్ని సార్లు ప్రమాదానికి గురయ్యాయి. మన దేశంలో 2010లో ఈ సిరీస్ కు చెందిన హెలిక్యాపర్ ప్రమాదానికి గురైంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ని తవాంగ్ కు సమీపంలో 2010 నవంబర్ 19న ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఈ హెలిక్యాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. 2011 ఏప్రిల్ నెలలో ఇదే తవాంగ్ పరిసరాల్లో హెలిక్యాప్టర్ నేలకొరిగింది. ఇందులో 17 మంది చనిపోయారు. 2012లో ఇదే సిరీస్ కు చెందిన హెలిక్యాప్టర్లు రెండు ఒక దానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 17 మంది ఉద్యోగులు మృతి చెందారు.
2018 జూలై నెలలో ఈ హెలిక్యాప్టర్ కూలిపోయింది. ఉత్తరాఖాండ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా భయటపడ్డారు. 2013 జూన్ నెలలో ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు నేలమట్టం కావడం వంటి ఘటనలో చోటు చేసుకున్నాయి. అక్కడి స్థానికులకు సహాయం అందించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. వారికి సహాయం సహాయం చేసేందుకు ఈ సిరీస్ హెలిక్యాప్టర్లనే వాడారు. అయితే బాధితుల రక్షణలో పాలుపంచుకుంటున్న సమయంలో ఈ హెలీక్యాప్టర్ ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. భారత రక్షణ కోసం పని చేసే క్షిపణి మన దేశానికి చెందిన ఈ సిరీస్ హెలీక్యాప్టర్‌ను కూల్చేసింది. ఈ ఘటన 2019 ఫిబ్రవరి నెలలో జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. శత్రుదేశానికి చెందిన డ్రోన్ గా భావించిన క్షిపణి.. ఈ హెలీక్యాప్టర్‌ను కూల్చేసింది. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు చనిపోయారు. గత నెలలో కూడా ఇదే సిరీస్ కు చెందిన హెలీక్యాప్టర్ కూలి ఐదురుగు మృతి చెందారు. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్ లో జరిగింది.