అనుకోకుండా ప్రియురాలిని చంపి, భయంతో బ్లేడ్ తో గొంతుకోసి.. ప్రియుడు పరార్...

Published : Jun 02, 2023, 01:28 PM ISTUpdated : Jun 02, 2023, 01:30 PM IST
అనుకోకుండా ప్రియురాలిని చంపి, భయంతో బ్లేడ్ తో గొంతుకోసి.. ప్రియుడు పరార్...

సారాంశం

ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. గొడవపడి.. అనుకోకుండా ఆమెను హత్య చేశాడు. ఆ తరువాత భయాందోళనకు గురైన అతను ఆమె గొంతు కోసి పొలంలో పడేశాడు.

ఢిల్లీ : ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. అనుకోకుండా ప్రియురాలిని హత్య చేసిన ఓ వ్యక్తి.. ఆ తరువాత భయంతో బ్లేడ్ తో ఆమె గొంతుకోసి.. పొలంలో పడేసి పారిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఉధమ్‌సింగ్ నగర్ ప్రాంతంలో జరిగింది. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ తన ప్రియురాలిని హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఆమె ఊహించని రీతిలో మృతి చెందడంతో కంగారుపడి, భయాందోళనకు గురైన నిందితుడు షేవింగ్ బ్లేడ్‌తో మహిళ గొంతు కోసి, మృతదేహాన్ని సమీపంలోని పొలంలో పడేశాడు.

ఈ కేసులో నిందితుడు నేరం అంగీకరించడంతో కాశీపూర్ పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేశారు. తనతో సంబంధం పెట్టుకుని.. మోసం చేస్తుందని తెలియడంతో నిందుతుడు తన ప్రియురాలి గొడవ పడ్డాడు. ఈ గొడవలో ప్రమాదవశాత్తు ఆమెను హత్య చేశాడని తెలిపారు.

17 ఏళ్ల అమ్మాయికి గుండెపోటు.. కాపాడడానికి ఏకమైన కేరళ...129కి.మీ. దూరాన్ని అధిగమించి..

పోలీసు సూపరింటెండెంట్ అభయ్ ప్రతాప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బాధితురాలితో గత ఎనిమిదేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె అతని దగ్గర కూలి పని చేసేది. వారిద్దరికీ అంతకు ముందే పెళ్లిళ్లయ్యాయి. అతనికి భార్య.. ఆమెకు భర్త ఉన్నారు. కానీ వీరిద్దరూ వివాహేతర సంబంధంలో ఉన్నారు.

పొలంలో మృతదేహం దొరకడానికి రెండు రోజుల ముందు ఈ గొడవ జరిగింది. ఆమె మృతి చెందింది. ఆ రోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో నిందితుడు మహిళను తోసేశాడు. దీంతో ఆమె విసురుగా కిందపడిపోయింది. ఆ విసురుకు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

కనోరి గ్రామంలోని పొలంలో పడి ఉన్న సావిత్రి దేవి మృతదేహాన్ని రెండు రోజుల తరువాత పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా పోస్టుమార్టం కోసం పంపించారు. కాగా, నిందితుడు ఒప్పుకోవడంతో ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు కాశీపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ప్రతాప్ సింగ్ తెలిపారు. నిందితుడి నుంచి హత్యాయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి విచారణను కొనసాగించేందుకు అధికారులు పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu