ముంబై పేలుళ్ల నిందితుడు అబూ సలెం‌కు పెళ్లి కావాలట? అందుకోసమే పెరోల్...

First Published Aug 7, 2018, 4:59 PM IST
Highlights

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబు పేలుళ్లకు పాల్పడి భారీ హింస సృష్టించిన నిందితుడి వింత కోరికను కోర్టు తిరస్కరించింది. తనకు పెళ్లి చేసుకోవలని ఉందని, అందుకోసం పెరోల్ పై విడుదల చేయాలని ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు అబూ సలెం బాంబే కోర్టును కోరాడు. అయితే అతడి అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. దీంతో బైటికి రావాలని అతడు చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
 
1993 ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో దాదాపు 300 మంది అమాయకులు బలయ్యారు. దాదాపు 1400 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్ల కేసులో మాఫియాతో లింకులున్న అబూ సలేం అరెస్టైన విషయం తెలిసిందే. అతడు ప్రస్తుతం తాలోజ జైళ్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తాజాగా అతడి మనసు పెళ్లిపైకి మళ్లింది. ఠాణే జిల్లా ముంబ్రాలో నివాసముండే ఓ మహిళకు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చానని, ఆ మాట నిలబెట్టుకోడానికి తనకు పెరోల్ మంజూరు చేయాలంటే బాంబే కోర్టుకు సలేం దరఖాస్తు చేసుకున్నాడు.

అబూ సలేం దరఖాస్తుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పెరోల్ ఇవ్వడం కుదరదంటూ తీర్పునిచ్చింది.  దీంతో అతడి పెరోల్ ఆశలు గల్లంతయ్యాయి. గతంలోను రెండు సార్లు అతడు పెట్టుకున్న పెరోల్ దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది. 
 
click me!