
ఢిల్లీ : డెల్టా కంటే అధిక వ్యాప్తి కలిగిన Omicron variant కేసులు దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికుల్లో బయటపడుతున్న
Positive కేసుల్లో దాదాపు 80 శాతం ఒమిక్రాన్ వేరియంట్ వే ఉంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో కేసుల సంఖ్యలో Delta variant ను ఒమిక్రాన్ భర్తీ చేయడం ప్రారంభించినట్లు తెలిపింది.
అయితే, అందులో మూడోవంతు కేసుల్లో స్వల్ప లక్షణాలు కనిపిస్తుండగా మిగతా కేసులన్నీ లక్షణాలు లేనివేనని పేర్కొంది. డిసెంబర్ 2వ తేదీన రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇలా దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలకే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించగా, ఇప్పటివరకు 1270 కేసులు నమోదైనట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కోవిడ్ టెస్టుల సంఖ్య భారీగా తగ్గినట్లు గుర్తించిన ప్రభుత్వం.. వీటిని భారీ స్థాయిలో చేపట్టాలని 19 రాష్ట్రాలకు సూచించింది.
వైరస్ ఉధృతి పెరిగిన క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అన్ని రాష్ట్రాలకు ఎప్పటకప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష చేపడుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ కూడా సీనియర్ అధికారులు, నిపుణుల బృందాలతో చర్చిస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వార్ రూంని ఏర్పాటు చేయడంతోపాటు ఆయా రాష్ట్రాల్లో మెడికల్ ఆక్సీజన్, ఔషధాల నిల్వలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వ్యాక్సినేషన్ వేగం పెంచామని.. ఇప్పటికే 90 శాతం అర్హులకు తొలిడోసు అందివ్వగా.. 64శాతం మందికి రెండు డోసులు ఇచ్చినట్లు పేర్కొంది.
మద్యం మత్తులో స్నేహితుడి మర్మాంగాన్ని కోసేశాడు..!
ఇదిలా ఉంటే.. Tamil Naduలో ఒక్కరోజే 76 Omicron కేసులు నమోదు షాక్ కు గురి చేస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 120కి పెరిగింది. 117 శాంపిల్స్‌ని పుణులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. 115 శాంపిల్స్ ఫలితాలు వచ్చాయని అందులో 74 మందికి ఒమిక్రాన్ ఉన్నట్టు తేలగా.. 41 మందిలో డెల్టా వేరియంట్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. ఇంకా రెండు నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు రాష్ట్రంలో 66 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 52 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో నమోదైన కేసుల్లో చెన్నైలోనే 95 కేసులు నమోదు కాగా.. చెంగల్‌పేటలో ఐదు, మధురైలో నాలుగు, తిరువల్లూరులో మూడు, సేలం, తిరువరూరు, కోయంబత్తూరు, పడుక్కొట్టై, తంజావూరు, తిరుచిరాపల్లి, రాణిపేటలలో ఒక్కో కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీంతో స్టాలిన్ సర్కార్ అప్రమత్తమయ్యింది. కరోనా నిబంధనలు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేయనున్నట్టు తెలిపింది ఆ రాష్ట్ర సర్కార్. ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నట్టు ప్రకటించింది.
మాల్స్, పార్లర్లు, పార్కులు, మెట్రో రైళ్లు, జువెలరీ షాపులు, థియేటర్లు 50 శాతం కెపాసిటీతో మాత్రమే నడిపించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని, 9 నుంచి ఇంటర్ వరకు మాత్రం ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని ప్రకటించింది. ఇక పెళ్లిలు, పార్టీల మీద ఆంక్షాలు విధించింది. కేవలం 100 మందితో నిర్వహించాలనీ, అలాగే.. అంత్యక్రియలకు కేవల 50 మంది మాత్రమే హాజరు కావాలని పేర్కొంది స్టాలిన్ సర్కార్.