హిందువుల దేవాలయంపై ముస్లిం: రామేశ్వర ఆలయంపై కలాం విగ్రహం.. కొండంత స్పూర్తి

First Published Jul 18, 2018, 6:22 PM IST
Highlights

నిరుపేద విద్యార్థి స్థాయి నుంచి శాస్త్రవేత్తగా..దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్థుల్ కలాం ఎందరికో ఆదర్శం. అలాంటి వ్యక్తిని దేశం గుండెల్లో పెట్టుకుంది

నిరుపేద విద్యార్థి స్థాయి నుంచి శాస్త్రవేత్తగా..దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్థుల్ కలాం ఎందరికో ఆదర్శం. అలాంటి వ్యక్తిని దేశం గుండెల్లో పెట్టుకుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పిన ఆయనకు సముచిత గౌరవాన్ని కల్పించింది రామేశ్వరం ఆలయం.. తమిళనాడులోని ఈ ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలన్నది హిందువుల కోరిక.

ఇలాంటి రామేశ్వరం ఆలయంపై అబ్ధుల్ కలాం విగ్రహాన్ని చెక్కించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ‘‘ తమిళనాడులోని రామేశ్వరం ఆలయంపై కలాం విగ్రహాన్ని చెక్కడం చాలా అద్భుతంగా ఉంది.. ఆయన నిజమైన హీరో.. అందరికీ స్ఫూర్తి.’’  

కాగా, గతేడాది జూలై 27న ప్రధానమంత్రి నరేంద్రమోడీ కలాం విగ్రహాన్ని ప్రతిష్టించినప్పుడు కూడా కలాం కుటుంబసభ్యులు ఆయన విగ్రహం దగ్గర ఖురాన్, బైబిల్ ఉంచడం అప్పట్లో చర్చనీయాంశమైంది.. మత వ్యవహారాలపై ఎండీఎంకే చీఫ్ వైగోతో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు అప్పట్లో నిరసన వ్యక్తం చేశాయి. 

click me!