ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికలు: 4 స్థానాల్లో ఆప్, బీజేపీకి షాక్

By narsimha lodeFirst Published Mar 3, 2021, 2:57 PM IST
Highlights

డిల్లీలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐదింటిలో నాలుగు స్థానాలను ఆప్ కైవసం చేసుకొంది. ఒక్క స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఎన్నికల ఫలితాలు 2022 ఎన్నికల్లో వచ్చే ఫలితాలకు నిదర్శనంగా డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పారు.

న్యూఢిల్లీ: డిల్లీలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐదింటిలో నాలుగు స్థానాలను ఆప్ కైవసం చేసుకొంది. ఒక్క స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఎన్నికల ఫలితాలు 2022 ఎన్నికల్లో వచ్చే ఫలితాలకు నిదర్శనంగా డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పారు.

నాలుగు స్థానాల్లో ఆప్ విజయం సాధించడంతో కార్యకర్తలను ఆయన అభినందించారు.  ఢిల్లీలోని నాలుగు వార్డులను  ఆప్ గెలుచుకొంది. కళ్యాణపురి, రోహిణి' సీ, త్రిలోక్‌పురి, షాలీమర్ బాగ్ స్థానాల్లో ఆప్ గెలిచింది.చౌహాన్ బంగార్ స్థానంలో  కాంగ్రెస్ గెలిచింది.

ఢిల్లీ, మా పార్టీ కార్యకర్తలను తాను అభినందిస్తున్నా.. ఈ ఫలితాలు ప్రజలు మనపై నమ్మకం ఉంచారని ఢిల్లీ సీఎం చెప్పారు. మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనికి ఈ ఫలితాలు రుజువుగా ఆయన చెప్పారు. 15 ఏళ్లు ఢిల్లీ ప్రజలు బీజేపీతో ఉద్రేకపడ్డారన్నారు. డిల్లీ నగరానికి ఏమీ ఇవ్వలేదన్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఇవాళ మధ్యాహ్నం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.

ఇవాళ ఫలితాలు వచ్చే ఏడాది ఏమి జరుగుతోందో ఊహించవచ్చన్నారు. మా విజేత అభ్యర్ధులు వినయంగా ఉండాలని ఆయన కోరారు. ఢిల్లీని శుభ్రపర్చే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టుగా కేజ్రీవాల్ చెప్పారు. 

ఢిల్లీలో నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడంపై  డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్విట్టర్ వేదికగా కార్యకర్తలను అభినందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని  బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా చెప్పారు.ఆదివారం నాడు ఐదు వార్డులకు ఎన్నికలు జరిగాయి. 50 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

click me!