AAP Focus On Gujarat: త‌గ్గేదేలే.. ఆప్ త‌రువాత టార్గెట్ గుజ‌రాతే !

Published : Apr 02, 2022, 02:46 AM IST
AAP Focus On Gujarat: త‌గ్గేదేలే..  ఆప్ త‌రువాత టార్గెట్ గుజ‌రాతే !

సారాంశం

AAP Focus On Gujarat:  ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న గుజరాత్ ఎన్నిక‌ల్లో ఆప్ పోటీ చేయాల‌ని భావిస్తోందట‌. ఈ మేర‌కు ప్రణాళిక ర‌చ‌న జ‌రుగుతోంద‌ట‌.  ఈ త‌రుణంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రికేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇప్పటికే రెండు రోజుల పర్యటన నిమిత్తం అహ్మదాబాద్ చేరుకోవ‌డం గ‌మ‌నార్హం.  

AAP Focus On Gujarat: ఇటీవ‌ల జ‌రిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. త‌గ్గేదేలే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ క్ర‌మ‌క్ర‌మంగా  అధికార విస్త‌ర‌ణ చేయాల‌ని యోచిస్తున్న‌రట‌. ఇప్ప‌టికే అతితక్కువ కాలంలో రెండు రాష్ట్రాల్లో తమ అధికారాన్ని విస్త‌రించిన ఆప్.. తాజాగా మ‌రో రాష్ట్రంపై క‌న్నేసిన‌ట్టు క‌నిపిస్తుంది. ఈ సారి మాత్రం భారీ టార్గెట్ నే సెట్ చేసుకున్న‌ట్టు.. తెలుస్తోంది. 

ఆ రాష్ట్ర‌మేదో కాదు.. ప్ర‌ధాని మోడీ స్వ‌రాష్ట్ర‌మైన గుజ‌రాత్ పై ఆప్ క‌న్ను ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న గుజరాత్ ఎన్నిక‌ల్లో అధికార బీజేపీని గ‌ద్దెదించి.. ఎలాగైనా.. అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంద‌ట‌. ఈ మేర‌కు ప్ర‌ణాళిక ర‌చ‌న కూడా జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ త‌రుణంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రికేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇప్పటికే రెండు రోజుల పర్యటన నిమిత్తం అహ్మదాబాద్ చేరుకున్నారు.

శ‌నివారం ఉద‌యం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు.  అక్క‌డ నుంచి.. తిరంగా యాత్ర అనే పేరు మీద  రెండు కిలోమీటర్ల రోడ్‌షో నిర్వహిస్తారు. ఇక ఆదివారం..అహ్మదాబాద్‌లోని స్వామినారాయణ ఆలయ సందర్శన షెడ్యూల్ చేయబడింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని గత ఏడాది కేజ్రీవాల్ ప్రకటించారు. గత ఏడాది మార్చిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ.. ఆప్ మంచి పనితీరు కనబరిచింది. ఆప్ 42 స్థానాలను గెలుచుకుంది .  తాలూకా పంచాయితీలలో 31 సీట్లు, మున్సిపాలిటీలలో9 సీట్లు, రెండు జిల్లా పంచాయతీ స్థానాలను ఆప్ కైవ‌సం చేసుకుంది. 

2017 లో జ‌రిగిన గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ అరంగేట్రం చేసినా.. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ప్రచార వైఫల్యం ఫ‌లితంగా..  29 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఈ ఫ‌లితాల‌ను దృష్టిలో పెట్టుకుని.. ప్ర‌ణాళిక‌లను రూపొందిస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ర్యాలీతో ప్రచారాన్ని పుంజుకున్న బీజేపీ, ఆప్ కాంగ్రెస్‌కు పోటీ అని ప్రకటించింది.  కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ ట్రాక్ రికార్డ్‌ను ఉదహరించారు, అక్కడ అది పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో 28 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆ త‌రువాత‌..  70 సీట్లలో 67 సీట్లతో నగరాన్ని కైవసం చేసుకుంది ఆప్.

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆప్ ఆచరణాత్మకంగా ఢిల్లీలో రిపీట్ చేసింది. ఈ ఏడాది ఆ ఫ‌లితాల‌ను పంజాబ్ లో రిపీట్ చేసింది. అక్కడ కాంగ్రెస్, బీజేపీ,అకాలీదళ్‌లను ఆప్ చిత్తు చేసింది. గోవాలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలతో ఖాతా తెరిచింది. ఇలా క్ర‌మక్ర‌మంగా..ఆప్ త‌న అధికారాన్ని విస్త‌రింప‌జేయాల‌ని ఆప్ నేత‌లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని సీఎం కేజ్రీవాల్ నివాసంపై ఇటీవల జరిగిన దాడిలో  ఇద్దరు నిందితుల‌ను భద్రత సిబ్బంది అదనపు చర్యలు తీసుకున్న‌ర‌ట‌.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !