రాయ్‌పూర్‌లో కుప్పకూలిన రెండంతస్తుల భవనం

Published : Feb 21, 2020, 05:21 PM IST
రాయ్‌పూర్‌లో కుప్పకూలిన రెండంతస్తుల భవనం

సారాంశం

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది.  ఈ ఘటనలో  ఎవరికిీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. 

రాయ్‌పూర్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని  రాయ్‌పూర్ లో  రెండంతస్తుల భవనం శుక్రవారం నాడు కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న భవనం పక్క భిల్డింగ్ కుప్పకూలింది.  ఈ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికీ కూడ ఎలాంటి గాయాలు కాలేదు.

అశీష్ మిశ్రా రెండు అంతస్తుల భవనం యజమాని.  ఈ భవనం పెట్రోల్ పంప్ పక్కన ఉంటుంది. ఈ భవనాన్ని సురేష్ కేశ్వానికి అద్దెకు ఇచ్చాడు.   సురేష్  ఇక్కడ రెస్టారెంట్ నిర్వహించేవాడు.  ఈ భవనం పక్కనే ఉన్న మైలేష్ కొతారి కాంప్లెక్స్ నిర్మాణంలో ఉంది.  దీని కోసం   తవ్వకాలు జరుపుతున్నారు. 

ఈ సమయంలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవనం  ఒక్కపక్క ఒరిగిపోయింది. భవనం ఒరగడం చూసిన ఉద్యోగులు భవనం నుండి బయటకు వచ్చారు. ఈ భవనం శిథిలావస్థకు చేరుకొందని ఈ కారణంగానే ఈ భవనం కూలిపోయిందని  పోలీస్ స్టేషన్ ఇంచార్జీ రమాకాంత్ సాహు ప్రకటించారు.ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని  పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

ఇదేం దూకుడు సామీ... సినిమాను తలదన్నేలా విజయ్ పాలన. లంచం అడిగితే..
Medical Shop: దేశ‌వ్యాప్తంగా మెడిక‌ల్ దుకాణాల బంద్‌.. కార‌ణం ఏంటంటే.?