
డోనాల్డ్ ట్రంప్ భారత్ పై భారీగా పన్నులను విధించాడు. మొదట పాతికశాతం టారిఫ్ లు విధించారు. అవి ఇప్పటికే అమల్లోకి వచ్చేసాయి. ఆ పాతిక శాతాన్ని 50 శాతంగా మారుస్తున్నట్టు ప్రకటించాడు. కానీ ఇంకా 50 శాతం టారిఫ్ లు అమల్లోకి రాలేదు. అయితే పాతికశాతం పన్నులు అమల్లోకి వచ్చాకే ధరలు చాలా పెరిగిపోయినట్టు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల కోసం ఇండియా నుంచి ఎన్నో వస్తువులు ఎగుమతి అవుతాయి. వాటన్నింటిపై కూడా పాతిక శాతం పన్నులు పడడంతో వాటి ధరలు ఎక్కువైపోయాయి. రోజువారీ సరుకులు నుంచి బిస్కెట్ల వరకు అన్నీ కూడా ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుందని అమెరికాలో ఉన్న ఇండియన్లు బాధపడుతున్నారు.
డల్లాస్ లో ఉన్న ఒక ప్రవాస భారతీయుడు వాల్ మార్ట్ స్టోర్ కు వెళ్లారు. అక్కడున్న ఇండియన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ధరలను వీడియోలో చూపించారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది. భారతీయ వ్యక్తి పేరు రజత్. ఇక్కడ మనకి పది రూపాయలకి దొరికే పార్లే జి బిస్కెట్ ప్యాకెట్లు అమెరికాలో 370 రూపాయలకి కొంటున్నట్టు ఆయన వివరించారు. అలాగే హల్దీ రామ్ స్నాక్స్ మసాలాలు కూడా ఒక్కొక్కటి 300 రూపాయలకు పైగా ధరలు పెరిగినట్టు ఆయన వివరించారు. ఆ ధరలు చూస్తే ప్రవాస భారతీయులకు కష్టాలు మొదలయ్యాయని అర్థమవుతోంది. హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్ కూడా 320 రూపాయలకు పెరిగింది. అది ఇండియాలో కేవలం 20 రూపాయలకే దొరుకుతుంది. అమెరికాలో ఇండియా నుంచి వచ్చే పప్పులు అరకిలో 400 రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాలో సంపాదనే కాదు ఖర్చులు కూడా ఎక్కువేనని దీన్నిబట్టి అర్థం చేసుకోవాలి.
అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు ఈ వీడియో చూశాక భయం మొదలైంది. అమెరికా వెళితే ఇన్ని ఖర్చులను భరించాలా అని వారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలో జీవితం చూసేందుకు అందంగా, నాగరికంగా ఉంటుంది. కానీ ధరలు ఖర్చులు అధికమని ముందుగానే అర్థం చేసుకోవాలి.
ఇక ట్రంప్ లాంటి అధ్యక్షుడు వస్తే ఎప్పుడూ ఏ రేట్లు పెరుగుతాయో... ఎప్పుడు ఏ దేశంతో కయ్యాన్ని కొని తెచ్చుకుంటాడో తెలియని పరిస్థితి. కాబట్టి అమెరికా కన్నా భారతదేశంలోనే ధరల పరంగా, ఖర్చులు పరంగా ఉన్నంతలో సంతోషంగా జీవించవచ్చని కొందరి నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మన దేశం నుంచి పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు అమెరికా చేరడానికి ఎంతో ఖర్చు అవుతుంది. రవాణా ఖర్చులు, దిగుమతి పన్నులు కూడా ఉంటాయి. ఇక ట్రంప్ వేసిన టారిఫ్ లు కూడా కలిపి పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కాస్త 370 రూపాయలకు చేరుకుంది. అదే మన దేశంలో అయితే చాలా సులభంగా ఇవన్నీ దొరుకుతాయి. కానీ అమెరికాలో మాత్రం అవన్నీ లగ్జరీ వస్తువులుగా మారిపోయాయి.
ఇండియన్ ఫుడ్ కోసం అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు ఎంతగా అల్లాడిపోతున్నారో చెప్పడానికి ఈ వీడియో చాలు. మనదేశంలో ఉన్న పేద ప్రజలు కూడా పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ ను కొనుక్కొని తినగలిగే స్తోమతను కలిగి ఉంటారు. కానీ అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులకు మాత్రం అది ఖరీదైన లగ్జరీ వస్తువుగా మారిపోయింది. మీరు కూడా ఈ వీడియోని చూసి నిజాలు తెలుసుకోండి. డాలర్ల కోసం విదేశాలకు వెళ్లే బదులు వచ్చిన జీతంతోనే ఇండియాలో బతకడం వందరెట్లు బెటర్ అని అనిపిస్తుంది.