28 మంది ఎమ్మెల్యేలకు బెదిరింపులు...దీపావళి పండగ చేసుకోలేరంటూ...

By Arun Kumar PFirst Published Oct 29, 2018, 4:15 PM IST
Highlights

ఓ వ్యక్తి ఏకంగా 28 మంది  ఎమ్మెల్యేలను వాట్సాప్ ద్వారా బెదిరించిన సంఘటన రాజస్థాన్ లో చోటుచుసుకుంది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో బాధిత నాయకులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అయితే పోలీసులు బెదిరింపులకు పాల్పడిన నిందితున్ని పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
 

ఓ వ్యక్తి ఏకంగా 28 మంది  ఎమ్మెల్యేలను వాట్సాప్ ద్వారా బెదిరించిన సంఘటన రాజస్థాన్ లో చోటుచుసుకుంది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో బాధిత నాయకులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అయితే పోలీసులు బెదిరింపులకు పాల్పడిన నిందితున్ని పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే త‌రుణ్ రాయ్ కాకా రూ.60 లక్షలు ఇవ్వాలంటూ వాట్సాఫ్ ద్వారా  మెసేజ్ చేశాడు. తాను అడినంత ఇవ్వకుంటే త్వరలో జరిగే దీపావళి వేడుకలు చూడటానికి ఉండకుండా చేస్తానంటూ బెదిరించాడు.  దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఎమ్మెల్యే స్థానిక బార్మ‌ర్‌లోని చౌహాన్ ప్రాంత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

నిందితుడు ఎమ్మెల్యేకు మరో మెసేజ్ కూడా చేశాడు.  ద‌ర్గా బ‌జార్‌లోని ఖురేషి హోట‌ల్ వ‌ద్దగల సిద్దీ మిఠాయి దుకాణం వద్ద ఉండే ఓ అమ్మాయికి తాను కోరిన డబ్బులు ఇవ్వాలని తెలిపాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి ఫోన్ నంబర్ ఆధారంగా అతడు అజ్మీర్ ద‌ర్గా మార్కెట్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే ఈ బెదిరింపులకు పాల్పడింది  ఓ హోటల్లో పనిచేసే వెయిటర్ గా పోలీసులు గుర్తించారు. 

ఈ బెదిరింపులకు పాల్పడిన 24 ఏళ్ల యూసుఫ్ హుస్సేన్ ను పోలీసులు విచారించగా కీలక నిజాలు బైటపెట్టాడు. కేవలం ఈ ఒక్క ఎమ్మెల్యేకే కాకుండా రాష్ట్రంలోని దాదాపు 27మంది శాసనసభ్యులను బెదిరించినట్లు నిందితుడు  వెల్లడించాడు.  అందులో కొందరు మంత్రులు  కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణను ముమ్మరం చేశారు. 

 
 

click me!