కారణమిదీ:ముకుల్‌రాయ్‌కి మోడీ ఫోన్

By narsimha lodeFirst Published Jun 3, 2021, 4:03 PM IST
Highlights

బీజేపీ జాతీయ అధ్యక్షుడు ముకుల్‌రాయ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు ఫోన్ చేశాడు. ముకుల్ రాయ్ తిరిగి టీఎంసీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో మోడీ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది. 

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు ముకుల్‌రాయ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు ఫోన్ చేశాడు. ముకుల్ రాయ్ తిరిగి టీఎంసీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో మోడీ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది. కరోనాతో ఆసుపత్రిలో ముకుల్ రాయ్ భార్య చికిత్స పొందుతోంది. ముకుల్ రాయ్ భార్య ఆరోగ్య పరిస్థితి గురించి మోడీ అడిగి తెలుసుకొన్నారు. 

ఇవాళ ఉదయం మోడీ ఫోన్ చేసినట్టుగా ముకుల్ రాయ్ కొడుకు సుభ్రాంగ్షు తెలిపారు.  అయితే ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రమే ప్రధాని మాట్లాడారని  ముకుల్ రాయ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.. కానీ ఎలాంటి రాజకీయ అంశాలు ఈ సందర్భంగా చర్చకు రాలేదని స్పష్టం చేస్తున్నారు.బెంగాల్ సీఎం  మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ  బుధవారం నాడు సాయంత్రం ముకుల్ రాయ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత బీజేపీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్  కూడ ఆసుపత్రికి వెళ్లి ముకుల్ రాయ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. టీఎంసీ నుండి బీజేపీలో చేరిన నేతల్లో ముకుల్ రాయ్ ఒకరు. అయితే బీజేపీలో ఆయన నిర్లక్ష్యానికి గురౌతున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో  ఆయన తిరిగి  టీఎంసీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. 

సువేందు అధికారిని  అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా ఆ పార్టీ ఎంపిక చేసింది. దీంతో   ముకుల్ రాయ్ కొంత అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన టీఎంసీ వైపు చూస్తున్నారనే ప్రచారం నెలకొంది. మమత బెనర్జీ కోర్ టీమ్ లో ముకుల్ రాయ్  గతంలో సభ్యుడుగా ఉండేవాడు. 2017లో ఆయన టీఎంసీని వీడి బీజేపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో  బీజేపీకి 18 ఎంపీ స్థానాలు దక్కాయి. ఈ విజయం వెనుక ముకుల్ రాయ్ పాత్రను విస్మరించలేమని చెబుతున్నారు.ఎన్నికలకు ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన నేతలు తిరిగి టీఎంసీలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారనే రిపోర్టులు వస్తున్నాయి.  సోనాలి గుహా, దీపెంద్ బిశ్వాస్, సరళ ముమ్ము, అమల్ ఆచార్య రజీబ్ బెనర్జీ తదితరులు టీఎంసీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.


 

click me!