ఢిల్లీలో అల్లర్లు: 9కి పెరిగిన మృతుల సంఖ్య, ఎన్డీటీవీ రిపోర్టర్లపై దాడి

By telugu teamFirst Published Feb 25, 2020, 5:11 PM IST
Highlights

ఈశాన్య ఢిల్లీలో చెలరేగుతున్న అల్లర్లలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈశాన్య ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మూకలు కర్రలు, రాళ్లు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నారు. సైన్యాన్ని పిలిపించడానికి అమిత్ షా సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. సిఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య మొదలైన ఘర్షణ అల్లర్లకు, లూటీలకు దారి తీసింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. మృతుల్లో  ఓ పోలీసు ఉన్నాడు. 

దుకాణాలను దగ్దం చేశారు. జనాలు కర్రలు, రాడ్స్ పట్టుకుని వీధుల్లో స్వైర విహారం చేస్తున్నారు. భజన్ పు, చాంద్ బాగ్, కరవాల్ నగర్ ల్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. సోమవారం సాయంత్రం ప్రారంభమైన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 

సైన్యాన్ని రప్పించాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంటున్నారు. అవసరమైనంత మేర కేంద్ర బలగాలు, పోలీసులు ఉన్నారని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రశాంతంగా ఉండాలని అమిత్ ప్రజలను కోరారు. పుకార్లను ఆపేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసిన తర్వాత ఆయన ఆ విజ్ఞప్తి చేశారు. 

పై నుంచి ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని, ఈ విషయాన్ని తాను అమిత్ షాతో చెబుతానని ముఖ్యమంత్రికేజ్రీవాల్ అంతకు ముందు అన్నారు. 

కాగా, ఎన్డీటీవీ రిపోర్టర్లపై, కెమెరామన్ పై దాడి జరిగింది.  ముగ్గురు రిపోర్టర్లపై, ఓ కెమెరామన్ పై దాడి జరిగింది. దాడులను ఆపడానికి పోలీసులు కూడా లేరని అంటున్నారు. 

click me!