మళ్లీ నేనే గెలుస్తా, మార్కెట్లు లేస్తాయ్: భారతీయ కంపెనీల సీఈఓలతో ట్రంప్

By narsimha lodeFirst Published Feb 25, 2020, 4:36 PM IST
Highlights

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  తానే మరోసారి విజయం సాధిస్తానని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. 

న్యూఢిల్లీ:  వచ్చే ఎన్నకల్లో తానే విజయం సాధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారుభారతీయ కంపెనీల సీఈఓలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీలో సమావేశమయ్యారు. 

 భారత్‌లో అద్భుతమైన స్వాగతం తనకు లభించిందని ఆయన చెప్పారు.భారత పర్యటన తనకు ఎంతో ఆనందాన్ని కల్గించిందన్నారు ట్రంప్.  అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ భారత్‌కు చెందిన పాశి్రామికవేత్తలను కోరారు.

Also read:ఇస్లాం తీవ్రవాదాన్ని అణచివేస్తాం: ట్రంప్

భారత్‌తో  భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుగుతున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు.వచ్చే ఆరేడు నెలల్లో ఒప్పందం కుదురుతుందని   ఆయన ధీమాను వ్యక్తం చేశారు.ఒప్పందానికి కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నట్టుగా ఆయన చెప్పారు. వీటిని అధిగమించాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. 

కరోనా వైరస్ విషయమై చైనా అధ్యక్షుడితో మాట్లాడినట్టుగా ట్రంప్ వివరించారు. కరోనా వైరస్ ప్రస్తుతం చైనాలో అదుపులో ఉన్నట్టుగానే ఉందన్నారు.  కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని ట్రంప్ చెప్పారు. 

తాను అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించగానే వేలాది పాయింట్లు పరుగులు పెడతాయన్నారు. ఒకవేళ తాను ఓటమి పాలైతే ఎప్పుడూ చూడని విధంగా  మార్కెట్లు కుప్పకూలిపోతాయని ఆయన జోస్యం చెప్పారు.

ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ  మహీంద్రా గ్రూప్  చైర్మన్  ఆనంద్ మహీంద్రా, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా లు హాజరయ్యారు.

  

click me!