బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు

By telugu teamFirst Published Aug 19, 2021, 12:49 PM IST
Highlights

పండుగల సీజన్ ప్రారంభమవడంతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సెలవులు పెరుగుతున్నాయి. ఇదే విధంగా బ్యాంకుల్లోనూ ఈ నెలలో ఎక్కువగానే సెలవులున్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు గల 13 రోజుల్లో 9 సెలువులున్నాయి. అయితే, ఇవన్నీ అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల్లో పండుగల అనుసారం సెలవులు కేటాయించింది. 

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకారం, ఆగస్టు నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులే ఉన్నాయి. ఇందులో ఎనిమిది సెలవులు ఆయా రాష్ట్రాల్లోని పండుగల అనుసారం కేటాయించింది. కాగా, ఏడు సెలవులు సాధారణంగా వచ్చే వీకెండ్ హాలీడేలు. ఈ నెలలో ఇవ్వాళ్టి నుంచి లెక్కిస్తే మరో తొమ్మిది రోజులు సెలవులే ఉన్నట్టు. ఈ నెల 19 నుంచి చివరి వరకు ఉన్న బ్యాంకు సెలవుల వివరాలు రాష్ట్రాలవారీగా ఇలా ఉన్నాయి.

1. ఆగస్టు 19, 2021(ముహర్రం-అషూరా)(అగర్తలా, అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, హైదరాబాద్, జైపూర్, జమ్ము కశ్మీర్, కోల్‌కతా, లక్నో, ముంబయి, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్)

2. ఆగస్టు 20, 2021 (ముహర్రం/ఓనమ్) (బెంగళూరు, చెన్నై, కొచ్చి, తిరువనంతపురం)

3. ఆగస్టు 21,2021 (తిరువోనం) (తిరువనంతపురం, కొచ్చి)

4. ఆగస్టు 22,2021 (ఆదివారం)

5. ఆగస్టు 23,2021 (శ్రీ నారాయణ గురు జయంతి) (తిరువనంతపురం, కొచ్చి)

6. ఆగస్టు 28,2021 (నాలుగో శనివారం)

7. ఆగస్టు 29,2021 (ఆదివారం)

8. ఆగస్టు 30,2021 (జన్మాష్టమి-శ్రావణ వద్-8/క్రిష్ణ జయంతి)(అహ్మదాబాద్, చండీగడ్, చెన్నై, డెహ్రాడూన్, జైపూర్, జమ్ము, కాన్పూర్, లక్నో, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, షిమ్లా, శ్రీనగర్, గ్యాంగ్‌టక్)

9. ఆగస్టు 31,2021 (శ్రీ క్రిష్ణ అష్టమి)(హైదరాబాద్)

click me!