80 అడుగుల లోతులో పడిపోయిన ట్రాక్టర్ ట్రాలీ.. 8 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు  

By Rajesh KarampooriFirst Published May 30, 2023, 2:09 AM IST
Highlights

రాజస్థాన్‌లోని ఝుంజును జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝుంజునులోని మానస మాత ఆలయంలో నిర్వహిస్తున్న హవన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న భక్తులతో కూడిన  ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
 

రాజస్థాన్‌లోని ఝుంజును జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. అదే సమయంలో 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..  ఉదయపూర్వతి ప్రాంతంలోని మానస మాత ఆలయంలో సోమవారం యజ్ఞం, భండారా నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు సుదూర గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ట్రాక్టర్ ట్రాలీలో వస్తున్న వారు ప్రమాదానికి గురయ్యారు. ట్రాక్టర్ అదుపు తప్పి దాదాపు 80 అడుగుల లోతులో ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన తర్వాత జనం గుమిగూడారు. క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో ఉదయపూర్వతి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే ఒకదాని తర్వాత ఒకటి అంబులెన్స్‌లు ఆసుపత్రికి చేరుకోవడం ప్రారంభించాయి. గాయపడిన వారిలో ఎక్కువ మంది మహిళలే. ట్రాక్టర్ వాలుపై నిలబడి ఉందని క్షతగాత్రులు తెలిపారు. ఈ సమయంలో అందులో డ్రైవర్ లేకపోవడంతో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి సుమారు 80 అడుగుల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.

ఉదయపూర్వతి ప్రాంతంలోని మానస మాత ఆలయంలో దుర్గామాత విగ్రహం ప్రతిష్టించబడింది. మే 24 నుంచి ఆలయంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోమవారం ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, అన్నదానం కార్యక్రమం జరగ్గా, సమీప ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

click me!