ఢిల్లీలో మైనర్ బాలికను కత్తితో పొడిచి, కొట్టి చంపాడు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 20 ఏళ్ల సాహిల్. తాజా ఈ హంతకుడికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏళ్ల సాక్షి దారుణ హత్య అందరినీ కలిచివేసింది. సాహిల్ అనే యువకుడు ఆ బాలికను పలుమార్లు కత్తితో పొడిచి.. పేగులను బయటకు తీశాడు. అంతటితో ఆగకుండా పెద్దబండరాయితో తలపై కొట్టి హతమర్చాడు. హంతకుడు సాహిల్‌ను ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో పోలీసులు పట్టుకున్నారు. సాహిల్ సాక్షిని క్రూరుడిలా కత్తితో పొడిచి, ఆపై బండరాయితో కొట్టడం సీసీటీవీ ఫుటేజీల ద్వారా తెరపైకి వచ్చింది.
సాక్షి ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక తెరపైకి వచ్చింది. సాక్షి శరీరంపై 16 పెద్ద గాయాలున్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. బరువైన వస్తువుతో కొట్టడంతో బాధితురాలి పుర్రె పగిలిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. సాక్షి మెడపై 6 గాయాలు, కడుపుపై 10 పెద్ద గాయాలు ఉన్నట్టు తెలుస్తుంది.
మరోవైపు హంతకుడు సాహిల్ కు సంబంధించి అనేక సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం..సాహిల్ వృత్తి రీత్యా ఫ్రిజ్-ఏసీ రిపేరింగ్ మెకానిక్. సాహిల్ కు బాధితురాలు సాక్షితో పరిచయం ఉన్నట్టు గుర్తించారు. అయితే.. ఆమెను చంపడానికి ఒక రోజు ముందు ఆమెతో గొడవ పడినట్టు గుర్తించారు.
ఇదిలా ఉంటే.. 20 ఏళ్ల సాహిల్‌కు sahi.lkhan3600 పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నట్టు బహిర్గతమైంది. సుమారు 400 మంది ఫాలోవర్స్,50కి పైగా పోస్టులున్నాయి. అతని బయోలో.. 'లవ్ యూ డార్క్ లైఫ్... దరూ లవర్... యారోన్ కి యారీ... సబ్ పెర్ భరీ... 5 జులై... లవ్ యూ మామ్' అని పేర్కొన్నారు.
ఈ ఖాతాలో పోస్టు చేసిన చివరి పోస్ట్‌లో హంతకుడు సాహిల్ అసలు రూపం బయటపడింది. ఆ పోస్టులో సాహిల్, అతని స్నేహితులు హుక్కా పార్టీలో పాల్గొని.. వారందరూ కలిసి హుక్కా తాగుతూ.. మత్తులో ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో పోస్టు చేయబడింది. ఆ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా 'సెల్ఫ్‌మేడ్' పాట ప్లే అవుతుండటం గమనించవచ్చు.
ఈ వీడియో సుమారు 6 వారాల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయబడింది. అంతేకాకుండా.. హంతకుడి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేయబడిన కొన్ని పాత పోస్ట్‌లలో, సాహిల్, అతని స్నేహితులు కొందరు ఇతర చిత్రాలలో కూడా హుక్కా తాగినట్లు కనిపించారు. ఇది కాకుండా, సిద్ధూ ముసేవాలా హత్య తర్వాత ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి అతనికి నివాళులర్పిస్తూ ఒక పోస్ట్ కూడా పోస్ట్ చేయబడింది, అందులో 'RIP Paaji' అని వ్రాయబడింది.
సాహిల్‌పై ఢిల్లీ పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు . ఆదివారం సాయంత్రం స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు బయల్దేరిన బాధితురాలు సాక్షి హత్యకు గురైంది. సాహిల్ ఆమెను అడ్డగించి, బండరాయితో దాడి చేసే ముందు పలుమార్లు కత్తితో పొడిచాడు. ఢిల్లీలోని రోహిణిలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.