భారీ ఎన్కౌంటర్: 9మంది మావోలు, ఇద్దరు పోలీసుల మృతి

By Arun Kumar PFirst Published Nov 26, 2018, 2:36 PM IST
Highlights

చత్తీస్ ఘడ్ లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలో మరోసారి తుపాకుల మోత మొదలయ్యింది. ఇవాళ ఉదయం కిష్టారం పోలిస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోల దళం ఎదురుపడింది. దీంతో అప్రమత్తమైన మావోయిస్టుల భద్రతాదళాలపై కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎన్కౌంటర్ 9 మంది మావోలతో పాటు ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు విడిచారు. 

ఇటీవల చత్తీస్ ఘడ్ లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా భద్రతా సిబ్బందంతా ఎన్నికల మందోబస్తులో ఉండటంతో చత్తీస్ ఘడ్ లో ఇటీవల ఎలాంటి ఎన్కౌంటర్లు జరగలేదు. అయితే ఎన్నికలు ముగియడంతో భద్రతా సిబ్బంది మావోయిస్టుల మళ్లీ మావోయిస్టుల ఏరివేతను చేపట్టారు. ఇలా చత్తీస్ ఘడ్ ఎన్నికల తర్వాత జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోలు భారీగా మృతిచెందారు. 

డిస్ట్రిక్ రిజ‌ర్వ్ గార్డ్స్‌, కోబ్రా ద‌ళాలు, సీఆర్‌పీఎఫ్ పోలీసులు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు.  మావోయిస్టుల కాల్పుల్లో డిస్ట్రిక్ రిజ‌ర్వ్ గార్డ్స్‌ కు చెందిన ఇద్దరు సిబ్బంది  మృతిచెందారు.  

ఈ ఎన్కౌంటర్ పై పోలీస్ అధికారి అవస్థి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్న ప్రకటించారు. మృతిచెందిన మావోయిస్టుల నుండి ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాలను అటవీ ప్రాంతం నుండి బైటకు తీసుకురాడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

click me!