యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు, ట్రక్కు ఢీ, 8 మంది మృతి

Published : Sep 28, 2022, 10:02 AM ISTUpdated : Sep 28, 2022, 10:11 AM IST
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు, ట్రక్కు ఢీ, 8 మంది మృతి

సారాంశం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూపీ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలో ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.యూపీలోని శారదా నది వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. ధౌర్జరా నుండి లఖింపూర్ ఖేరికి ప్రైవేట్ బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం ఏడున్నర గంటల సమయంలో లఖీంపూర్ ఖేరీకి సమీపంలోని ఇసానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా నది వంతెనపై ఎదురుగా వస్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులోని ఎనిమిది మంది మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని లక్నో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిపట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తమిళనాడు అసంబ్లీలో గందరగోళం | Udhayanidhi Stalin vs Aadhav Arjuna | CM Vijay | Asianet News Telugu
మాటలకందని విషాదం.. కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్ర‌మాదం 14 మంది మృతి, బిల్డింగ్ నుంచి దూకిన విద్యార్థులు